ఓ పెద్ద గోడౌన్ లో నీలం రంగు తోపుడు బండ్లల్లో కూరగాయలు ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ మార్కెట్ ను బెంగళూరులో రైతులే మొదలుపెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఫోటోలకు ప్రస్తుతం జరుగుతున్న రైతు ఆందోళనలకు లింక్ చేస్తూ ఉన్నారు.
'కర్ణాటకకు చెందిన రైతులు బెంగళూరు నగరంలో కొంచెం ప్లేస్ ను తీసుకుని సొంతంగా సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేశారని అన్నారు. పంజాబ్, ఉత్తర ప్రదేశ్ హర్యానా రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో చేస్తే బాగుంటుంది' అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
" कर्नाटक के किसानों ने बेंगलुरु शहर में जगह लेकर अपना सुपर मार्केट तैयार कर लिया है।
लेकिन यह पंजाब ,उत्तरप्रदेश और हरियाणा में भी ऐसा कुछ प्रयोग किसानों के द्वारा मिलकर किया जाना चाहिए" అంటూ హిందీలో ట్వీట్లు చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
రైతులే సొంతంగా వెజిటేబుల్ మార్కెట్ ను ఏర్పాటు చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఈ ఫోటోలు బెంగళూరు కు చెందిన అగ్రికల్చరల్ స్టారప్ కంపెనీ 'హ్యూమస్'(HUMUS) కు చెందినది.
ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా HUMUS కు చెందినదని తెలుస్తుంది. వైరల్ ఫోటో లోని బ్యానర్ ద్వారా కూడా హ్యూమస్ సంస్థకు చెందినవిగా గమనించవచ్చు. అలాగే వెబ్సైట్ లో కూడా ఇదే ఫోటోలను పోస్టు చేశారు.
HUMUS అన్నది అగ్రికల్చర్ స్టార్టప్ కంపెనీ బెంగళూరులో 2019న మొదలు పెట్టారు. మంజునాథ్ టి.ఎన్., శిల్ప గోపాలయ్య కలిసి మొదలుపెట్టారు. భారత్ లో వ్యవసాయ చైన్ లో జరుగుతున్న బేధాలను తొలగించడానికి ఈ సంస్థను స్థాపించారు. బెంగళూరులో స్థాపించబడిన నిజమైన ధరకు లభించే మొదటి పండ్లు, కూరగాయలకు చెందిన సూపర్ మార్కెట్ ఇదని చెప్పారు. రైతులకు న్యాయం చేయాలనే ఈ సూపర్ మార్కెట్ ను మొదలుపెట్టారు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న ఫోటోను ఫేస్ బుక్ లో సదరు సంస్థ పెట్టింది. ఈ సంస్థ కవర్ ఫోటోలో కూడా వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న ఫోటోలు ఉన్నాయి.
ఈ స్టార్టప్ కంపెనీకి సంబంధించిన సమాచారం పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ కంపెనీలో 30 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇతర చోట్లతో పోలిస్తే 20 శాతం తక్కువ ధరకే పండ్లు, కూరగాయలు లభిస్తూ ఉన్నాయి.
ఈ స్టార్టప్ కంపెనీకి దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు ఎటువంటి సంబంధం లేదు. బెంగళూరు లో రైతులు సొంతంగా స్థలం తీసుకుని సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.