ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేట్ అత్యధికంగా ఉందని చెబుతూ కొన్ని పోస్టులు వాట్సాప్ లో వైరల్ అవుతూ ఉన్నాయి. మహిళలపై ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయని ఆ పోస్టుల్లో చెబుతూ ఉన్నారు.
దేశంలోనే మహిళలపై అత్యధిక నేరాల రేటు ఆంధ్రప్రదేశ్‌లో ఉందని పేర్కొంటూ వాట్సాప్ యూజర్లు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాల స్థాయిని చూపించే వీడియోను షేర్ చేస్తున్నారు. "#APUnsafeForWomen" అనే టెక్స్ట్‌తో బాధితుల ముఖాలతో కూడిన వీడియోగా చెబుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో మార్చి 2021లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమంలోనిది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈవెంట్ లైవ్ రికార్డింగ్‌ను 8 మార్చి 2021న టీడీపీ ట్వీట్ చేసింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) సెప్టెంబర్ 2021లో విడుదల చేసిన 'క్రైమ్ ఇన్ ఇండియా 2020' నివేదిక ప్రకారం, 2020లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై మొత్తం 17089 నేరాలు జరిగాయి. 2019తో పోలిస్తే 2020లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలు 3% తగ్గాయని NCRB ద్వారా తెలుస్తోంది. 2020లో భారతదేశంలో మహిళలపై అత్యధిక నేరాల రేటు ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ మొత్తం 49385 నేరాలు ఆ రాష్ట్రంలో మహిళలపై జరిగాయి (నివేదికలోని 247వ పేజీలోని డేటా ప్రకారం).
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 534 మహిళల కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఇదే కేటగిరీలో 9,109 కేసులు ఉత్తరప్రదేశ్ లో నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై జరిగిన దాడులపై 4886 కేసులు నమోదయ్యాయి, ఇదే కేటగిరీలో 12,605 కేసులు ఒడిశాలో నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 49 కేసులు సైబర్ క్రైమ్ లో నమోదవ్వగా.. 526 కేసులు ఒడిశాలో నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 435 కేసులు వరకట్న వేధింపుల కేటగిరీలో నమోదవ్వగా.. 3,031 కేసులు ఇదే కేటగిరీలో ఉత్తరప్రదేశ్ లో నమోదయ్యాయి.
NCRB 2021కి సంబంధించిన డేటాను ఇంకా విడుదల చేయలేదు. ప్రస్తుతం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మహిళలపై అత్యధిక నేరాల రేటును కలిగి ఉంది.