MP Congress ట్విట్టర్ ఖాతాలో అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు పేరును అదానీ ఎయిర్ పోర్టుగా మార్చారు అంటూ పోస్టు పెట్టారు.
अहमदाबाद एयरपोर्ट का नाम-
— सरदार वल्लभभाई पटेल से अडानी एयरपोर्ट हुआ..!
"जब तक मोदी सरकार आपकी किडनी नहीं बेच देती, मुँह पर मास्क लगाकर रखें" అంటూ పోస్టును పెట్టారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా పెట్టారు. డిసెంబర్ 13, 2020న పెట్టిన ఈ పోస్టులో 'అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ నుండి అదానీగా ఎప్పుడు చేశారో తెలియదు. ఏదో ఒకరోజు మోదీ ప్రభుత్వం మీ కిడ్నీలను కూడా అమ్మివేస్తుంది' అని చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ:
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్టు పేరును 'అదానీ ఎయిర్ పోర్టు' గా మార్చారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
ఎయిర్ పోర్టు పేరు ఏమైనా మార్చారా అని న్యూస్ మీటర్ పలు వార్తా సంస్థలను పరిశీలించగా.. ఎటువంటి కథనాలు కూడా లేవు. Airport Authority of India (AAI) ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో కూడా అలాంటి కథనాలు కనిపించలేదు.
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ పోర్ట్ నిర్వహణ బాధ్యతలను అదానీ గ్రూప్ కు అందించాయి. నవంబర్ 6, 2020న నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అంతేకానీ ఎయిర్ పోర్ట్ పేరును మాత్రం మార్చలేదు. అదానీ ఎయిర్ పోర్ట్స్ అదానీ గ్రూప్ కు చెందినది. అందుకు సంబంధించిన బ్యానర్లలో అదానీ కంపెనీ లోగో ఉంటుంది.
అదానీ ఎయిర్ పోర్ట్ లోగో లక్నో ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన బ్యానర్లలో కూడా ఉంది. అంతేకానీ అదానీ పేరు ఎయిర్ పోర్టులకు పెట్టారు అనడంలో ఎటువంటి నిజం లేదు.
https://navbharattimes.indiatimes.com/business/business-news/adani-group-take-over-airport-operation-at-lucknow-from-today-2nd-november/articleshow/79001327.cms
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్టు పేరును 'అదానీ ఎయిర్ పోర్టు' గా మార్చలేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.