Fact Check : అదానీ కంపెనీ 2019లో పలు అగ్రికల్చరల్ కంపెనీలను రిజిస్టర్ చేయించిందా..?

Adani Group did not register agricultural companies in 2019. అదానీ గ్రూప్ కు చెందిన ఆగ్రో కంపెనీలకు చెందిన లిస్ట్

By Medi Samrat  Published on  15 Dec 2020 4:31 AM GMT
Fact Check : అదానీ కంపెనీ 2019లో పలు అగ్రికల్చరల్ కంపెనీలను రిజిస్టర్ చేయించిందా..?

అదానీ గ్రూప్ కు చెందిన ఆగ్రో కంపెనీలకు చెందిన లిస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు దీక్ష చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ బిల్లులను తీసుకుని వచ్చిందనే విమర్శలు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే అదానీ గ్రూప్ కు సంబంధించిన అగ్రికల్చరల్ కంపెనీలకు 2019 లో రిజిస్టర్ జరిగిందంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.



అదానీ గ్రూప్ 2019 లో పలు అగ్రికల్చరల్ కంపెనీలను రిజిస్టర్ చేయించిందని.. 2020లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను తీసుకుని వచ్చిందని పోస్టుల్లో చెబుతూ ఉన్నారు.

"2019: Adani registered multiple Agri based companies. 2020: Modi passes farm bills which are designed to help Corporates like Adani." అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ ఉన్నారు.



ఫేస్ బుక్ లో కూడా ఈ పోస్టును వైరల్ చేస్తూ ఉన్నారు.

Archive links: https://web.archive.org/save/https://twitter.com/VinayDokania/status/1336641775805480962

https://web.archive.org/save/https://www.facebook.com/thekkeunni.sreedharan/posts/188765069561213

నిజ నిర్ధారణ:

2019 లో అదానీ గ్రూప్ పలు వ్యవసాయ సంబంధిత కంపెనీలను స్థాపించిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

వైరల్ అవుతున్న పోస్టును నిశితంగా గమనిస్తే అమిత్ మాలిక్ అనే వ్యక్తికి సంబంధించిన వైరల్ లిస్ట్ అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. అందులో మాలిక్ అపాయింట్ మెంట్ డేట్ ఉంది. మాలిక్ అదానీ అగ్రి లాజిస్టిక్స్ కు డైరెక్టర్ గా ఉన్నారు. పలు ప్రాంతాలకు సంబంధించిన అపాయింట్ లిస్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది.

డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ 08397245 ద్వారా చూడగా.. పలు వెబ్సైట్లలో అచ్చం ఇలాంటి లిస్టునే గమనించవచ్చు. డైరెక్టర్షిప్ కు సంబంధించిన పలు డీటైల్స్ అందులో ఉన్నాయి.

https://www.instafinancials.com/director/amit-malik/08397245

ఇక WHOIS డేటా బేస్ ను చూడగా www.adaniagrilogistics.com ను 2014 లోనే స్థాపించారు 2019 లో కాదు.

https://in.godaddy.com/whois/results.aspx?checkAvail=1&tmskey=tmskey=123&domain=www.adaniagrilogistics.com

Adani Agri Logistics Ltd కంపెనీని 2005 లో స్థాపించినట్లుగా Bloomberg.com లోని కంపెనీ ప్రొఫైల్ ను చూస్తే అర్థం అవుతోంది.

2019లో అదానీ కంపెనీ పలు అగ్రికల్చరల్ కంపెనీలను రిజిస్టర్ చేయించిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:అదానీ కంపెనీ 2019లో పలు అగ్రికల్చరల్ కంపెనీలను రిజిస్టర్ చేయించిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story