Fact Check : 25000 మంది భారత సైనికులు శౌర్య చక్ర పురస్కారాలను వెనక్కు ఇచ్చేశారా..?

25,000 Indian soldiers did not return their Shaurya Chakra medals. ప్రజాశక్తి పేపర్ క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో

By Medi Samrat  Published on  18 Dec 2020 1:45 PM GMT
Fact Check : 25000 మంది భారత సైనికులు శౌర్య చక్ర పురస్కారాలను వెనక్కు ఇచ్చేశారా..?

ప్రజాశక్తి పేపర్ క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా 25000 మంది సైనికులు శౌర్య చక్ర పురస్కారాలను వెనక్కు ఇచ్చేశారంటూ అందులో ఉంది. కిసాన్ కు జై కొట్టిన జవాన్ అని ఆ పేపర్ క్లిప్పింగ్ లో ఉంది.




నిజ నిర్ధారణ:

భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ 25000 శౌర్య చక్ర పురస్కారాలను ఇవ్వలేదు. ప్రభుత్వ వెబ్సైట్ ను పరిశీలించగా.. శౌర్య చక్ర అవార్డును అందుకున్న జవాన్ల పేర్లు 2000 పై చిలుకు మాత్రమే. కాబట్టి 25000 శౌర్య చక్ర పురస్కారాలను వెనక్కు ఇచ్చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

అంతే కాకుండా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పిఐబి) కూడా ఈ వార్తా కథనంలో ఎటువంటి నిజం లేదని తెలిపింది.

"Claim: Prajasakti newspaper has claimed that 25000 soldiers of the #IndianArmy have returned their Shaurya Chakra medals in solidarity with farmers' protest. #PIBFactCheck: This news is false. Only 2048 #ShauryaChakra have been awarded from 1956 till 2019." అంటూ ట్వీట్ చేసింది. ప్రజాశక్తి న్యూస్ పేపర్ లో వచ్చిన కథనాల్లో ఎటువంటి నిజం లేదని తెలిపింది. 2048 మందికి మాత్రమే 1956 సంవత్సరం నుండి 2019 సంవత్సరం మధ్య శౌర్య చక్ర ఇచ్చారని స్పష్టం చేసింది. అంతేకాకుండా అందుకు సంబంధించిన ప్రెస్ రిలీజ్ స్టేట్మెంట్ కూడా చేసింది.



https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1680782

25000 మంది భారత సైనికులు శౌర్య చక్ర పురస్కారాలను వెనక్కు ఇచ్చేశారంటూ వైరల్ అవుతున్న కథనాల్లో ఎటువంటి నిజం లేదు.


Claim Review:25000 మంది భారత సైనికులు శౌర్య చక్ర పురస్కారాలను వెనక్కు ఇచ్చేశారా..?
Claimed By:Prajashakti Telugu News paper
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Telugu News Paper
Claim Fact Check:False
Next Story