చంద్రబాబుకు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి కౌంటర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Aug 2020 12:24 PM IST
చంద్రబాబుకు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి కౌంటర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లెటర్ రాయడం కలకలం రేపింది. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సాక్ష్యాలు ఏవైనా ఉంటే తమకు ఇవ్వాలని కోరారు.

ప్రధానికి రాసిన లేఖలో చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారన్న గౌతమ్ సవాంగ్, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగుకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారని అన్నారు. ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించిన వివరాలేమైనా ఉంటే సమర్పించాలని డీజీపీ కోరారు. అలా ఉల్లంఘనలు జరిగినట్టు ఏమైనా ఆధారాలుంటే సమర్పించాలని కోరారు. రాజ్యాంగాన్ని, వ్యక్తిగత గోప్యత హక్కును కాపాడేందుకు సిద్దంగా ఉన్నామన్న ఆయన, పౌరుల హక్కుల పరిరక్షణలో మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు.



గౌతమ్ సవాంగ్ సహకరించమని కోరినప్పటికీ చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు సాక్ష్యాలు ఇవ్వమని కోరిన గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలకు ఎందుకు స్పందించడం లేదో ఆశ్చర్యంగా ఉందని అన్నారు దినేష్ రెడ్డి.

Next Story