దిగ్విజయ్‌సింగ్‌ను అడ్డుకున్న కర్నాటక పోలీసులు..

By అంజి  Published on  18 March 2020 4:25 AM GMT
దిగ్విజయ్‌సింగ్‌ను అడ్డుకున్న కర్నాటక పోలీసులు..

హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. బెంగళూరులోని ఓ హోటల్‌లో ఉన్న మధ్యప్రదేశ్ రెబెల్‌ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దిగ్విజయ్‌ సింగ్‌ కర్నాటక కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆ హోటల్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హోటల్‌లో ఉన్నారని, వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నాయని, వారి మాట్లాడాలని వచ్చానని పోలీసులకు చెప్పారు. తనను లోపలికి అనుమతించాలని దిగ్విజయ్‌ సింగ్‌ కోరారు.

అయితే పోలీసులు మాత్రం ఆయన లోపలికి అనుమతించలేదు. దిగ్విజయ్‌ సింగ్‌ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నిందని దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. రోడ్డుపై కూర్చోనే ఆయన ఇతర నేతలతో కలిసి టీ తాగారు.

మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సర్కార్‌కు ఆ పార్టీ సీనియర్‌నేత జ్యోతిరాధిత్య సింధియా షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ సర్కార్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో సింధియా వెంట 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. కాగా సింధియా బీజేపీలో చేరడంతో, ఆయనకు రాజ్యసభ సీటు దక్కనుంది. ఇదిలా ఉంటే అప్పటి వరకు స్వల్ప మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కమల్‌నాథ్‌ ప్రభుత్వంపై సింధియా తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో ఎమ్మెల్యేల బలం తగ్గింది. రెండు రోజుల క్రితం బలపరీక్ష జరగాల్సి ఉండగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అది వాయిదా పడింది.



Next Story