Fact Check : మే 22-28 వరకూ సమరాత్రి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 May 2020 5:17 AM GMT
Fact Check : మే 22-28 వరకూ సమరాత్రి

గత కొద్దిరోజులుగా భారతదేశం లోని చాలా ప్రాంతాలు తీవ్రమైన వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటూ ఉన్నాయి. భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో నాలుగు రోజుల పాటూ వేడి గాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5-6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మెసేజీ వైరల్ అవుతోంది. అందులో అధికంగా నీటిని తాగాలని అది కూడా మే 22 నుండి మే 28 మధ్య అని చెబుతూ ఉన్నారు. ఈ రోజుల్లో భూమిపై సమ రాత్రి అన్నది ఉంటుందని.. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలని ఆ మెసేజీలో చెప్పారు.

“Drink more water for the next seven days (May 22-28) due to EQUINOX(Astronomical event where the Sun is directly above the Earth’s equator). Resultantly, the body gets dehydrated very fast during this period. Please share this news to maximum groups. Thanks #MonthOfBlessings” అంటూ మెసేజీ వైరల్ అవుతోంది.



మే 22-28 మధ్య సూర్యుడు భూమికి సరిగ్గా పైన ఉంటాడని.. రాత్రి-పగలు సమానంగా ఉంటాయన్నది ఆ మెసేజీలో చెప్పుకొచ్చారు.

ఈ మెసేజీ గురించి సెర్చ్ చేయగా.. ఇది 2017 నుండి వైరల్ అవుతూనే ఉంది. 2018 సంవత్సరంలో కూడా ఇది వైరల్ అయ్యిందని తెలుస్తోంది. smhoaxslayer.com, india.com సంస్థలు కూడా ఈ మెసేజీ ఫేక్ అని నిర్ధారించాయి.

https://smhoaxslayer.com/the-may-equinox-hoax/

ఈ మీడియా సంస్థల కథనాల్లో భూమి అటు సూర్యుడికి దూరంగా కానీ దగ్గరగా కానీ ఉండదు. అందుకే దీన్ని ఇంగ్లీష్ లో equinox అని అంటారు. లాటిన్ పదమైన equinox లో equi అంటే సమం.. nox అంటే రాత్రి అని అర్థం. రాత్రి పగలు 12 గంటల పాటూ ఉంటాయన్నది equinox పదానికి అర్థం. ప్రస్తుతం అటువంటిది ఏమీ లేదని తెలుస్తోంది. సదరు వెబ్ సైట్స్ కూడా equinox మెసేజీ పచ్చి అబద్ధం అని గతంలోనే తేల్చేశాయి.

https://www.india.com/news/india/equinox-2018-fake-whatsapp-message-on-astronomical-event-being-circulated-widely-heres-the-truth-3065654/

సమరాత్రి అన్నది ఎప్పుడు ఉంటుందో చాలా వాతావరణ సంస్థలు గతంలో తెలిపాయి. ఋతువులు మారే సమయంలోనే సమరాత్రి అన్నది వస్తూ ఉంటాయి. మర్చి నెల, సెప్టెంబర్ నెలల్లో సమరాత్రి అన్నది ఏర్పడుతూ ఉంటుంది. మర్చి 21, సెప్టెంబర్ 23 తేదీల్లో గతంలో equinox ఏర్పడింది.

https://www.britannica.com/story/whats-the-difference-between-a-solstice-and-an-equinox

ఈ ఏడాది సమరాత్రి మార్చి 20న ఏర్పడింది.

https://earthsky.org/astronomy-essentials/everything-you-need-to-know-vernal-or-spring-equinox

నిజమేమిటంటే: ప్రస్తుతం సోషల్ మీడియాలో మే 22-28 మధ్య సమరాత్రి ఏర్పడబోతోంది అన్న వైరల్ మెసేజీ పచ్చి అబద్ధం.

Claim Review:Fact Check : మే 22-28 వరకూ సమరాత్రి
Claim Fact Check:false
Next Story