కరోనా వైరస్ భారత్ ను పట్టి పీడిస్తోంది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా లో ఫేక్ మెసేజీలు వైరల్ అవుతూ ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి కుటుంబానికి 15000 రూపాయలు ఇస్తున్నారంటూ కొద్దిరోజుల కిందట మెసేజీ వైరల్ అయిన సంగతి తెలిసిందే..! తాజాగా అలాంటి మెసేజ్ నే వాట్సప్ లో వైరల్ చేస్తూ ఉన్నారు.

భారత ప్రభుత్వం 5000 రూపాయలు ప్రతి ఒక్క పౌరుడికి ఇస్తోందంటూ ఆ మెసేజీలో ఉంచారు. ఫెడరల్ గవర్నమెంట్ ఈ ఫండ్ ను ఇస్తోందని.. అంతేకాకుండా ప్రెసిడెంట్ గా నైజీరియా లోగోను కూడా ఆ మెసేజీలో ఉంచారు.

ఇంతకూ ఆ మెసేజీలో ఏముందంటే..
FG has finally approved and started giving out free Rs 5,000 relief funds to each citizen Below is how to claim and get yours credited instantly as I have just did now
https://bit.ly/free—funds
Note : You can only claim and get credited once and it’s also limited so get yours now instantly.”

ఫెడరల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క పౌరుడికి 5000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకుంది. కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయడం ద్వారా డబ్బును పొందవచ్చు. ఒక్క సారి మాత్రమే మీకు ఈ సదుపాయం ఉంటుంది… అన్నది మెసేజీ సారాంశం.

Fact Check: Viral WhatsApp message on Rs 5K lockdown relief fund to every citizen is false

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజీ ‘పచ్చి అబద్ధం’
కొందరు ట్విట్టర్ యూజర్లు ఈ మెసేజీని తమ అకౌంట్ లో పోస్టు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

నిజమెంత: 
న్యూస్ మీటర్ ఈ మెసేజీపై ఫ్యాక్ట్ చేసింది. ఈ లింక్ ను క్లిక్ చేయగా.. ఆన్ లైన్ సర్వేకు వెళ్ళింది. లాక్ డౌన్ ఫండ్ కు సంబంధించిన సర్వే అంటూ తేలింది.

fund.ramaphosafoundation.com లింక్ కు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. సైరిల్ రామపోస ఫౌండేషన్ అన్నది సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఈ ఫౌండేషన్ ఛైర్మన్ సౌత్ ఆఫ్రికా ప్రస్తుత ప్రెసిడెంట్ సిరిల్ రామపోస.

క్లిక్ చేయగానే లింక్ ఓపెన్ అవుతుంది:

New Project (66)

సర్వే మీద క్లిక్ చేయగానే ఇంగ్లీష్ లో ప్రశ్నలు మొదలవుతాయి Are you an Bonafide Indian Citizen?” అంటూ మెసేజీ సాగుతుంది.

New Project (67)

దాని మీద ఎస్/నో అంటూ క్లిక్ చేయగానే రెండో ప్రశ్న ”How much can sustain you throughout the lockdown?”మీకు ఎదురవుతుంది.
లాక్ డౌన్ లో బ్రతకడానికి మీకు ఎంత అవసరం అవుతుంది. అని అందులో 2000, 5000, 10000 రూపాయలు అడుగుతుంది. ప్రస్తుతం 10000 అందుబాటులో లేదని చెబుతున్నారు.
5000 రూపాయల మీద క్లిక్ చేయగానే “What will you use your free Rs.5,000 for?” అంటూ మరో ప్రశ్న మీకు ఎదురవుతుంది.

సర్వే ను షేర్ చేయండి:
సర్వే పూర్తీ అవ్వగానే.. ఆ వెబ్ సైట్ లో ఏడు వాట్సప్ గ్రూప్ లలో ఈ మెసేజీని షేర్ చేయండి అని అడుగుతుంది. అలా షేర్ చేసిన వెంటనే మీ అకౌంట్ నేమ్, నంబర్ ను ఇవ్వమని కోరుతుంది. మీరు 5000 రూపాయలు లాక్ డౌన్ ఫండ్ ను సొంతం చేసుకోబోతున్నారు అని తెలియజేస్తుంది.

Congratulations, you are eligible for the free Rs.5,000 lockdown funds.

How to get your Rs.5,000 credited to your account

1.Before you continue, click the green button “SHARE” and send this to 7 WhatsApp groups (Only Groups)

New Project (68)

2.After the sharing, you will be asked for account number and bank name to receive the Rs.5,000 cash.”

ఫేక్ ఫేస్ బుక్ కామెంట్లు:

అందరినీ నమ్మించడానికి ఫేస్ బుక్ మెసేజీలను కూడా ఫోటో షాప్ చేసి ఆ వెబ్ సైట్ లో  పెట్టారు.

ఎన్ని సార్లు వెబ్ సైట్ ను ఓపెన్ చేసినా.. తీసుకున్న వాళ్ళ పేర్లు, తీసుకున్న సమయం అన్నదాంట్లో మార్పు రాదు. ఎన్ని సార్లు సర్వే చేసినా అవే ఫేక్ కామెంట్లు ఉన్న పోస్ట్ కనిపిస్తుంది.  ‘204,208′ లైక్స్, ‘173,330’ కామెంట్లలో మార్పు అన్నది కనిపించదు.

New Project (69)

నిజమేమిటంటే:
ప్రతి ఒక్క పౌరుడికి 5000 రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది అన్నది పచ్చి అబద్దం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.