నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. పలువురు ప్రముఖులు బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణకు బర్త్ డే విషెష్ చెప్పిన వారిలో భారత క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ కూడా ఉన్నారు. "Wishing a very Happy Birthday to Nandamuri Balakrishna sir. Keep inspiring the world with your entertaining performances and humanitarian activities. My best wishes #HappyBirthdayNBK @basavatarakam" అంటూ యువీ ట్వీట్ చేశారు. బాలయ్యతో యువరాజ్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

బాలకృష్ణ సర్, మీ వినోదాత్మక ప్రదర్శనలు, మానవతా దృక్పథంతో కూడిన మీ కార్యక్రమాలతో ఈ ప్రపంచానికి నిత్యస్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ గతంలో బాలయ్యతో దిగిన ఫోటోను యువరాజ్ సింగ్ పోస్టు చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా బాలయ్య ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉన్నారు. క్యాన్సర్ ను జయించి తిరిగి క్రికెట్ లో అడుగుపెట్టిన యువరాజ్ కూడా ఎంతో మందికి ఆదర్శం. తన ఫౌండేషన్ ద్వారా కూడా యువరాజ్ క్యాన్సర్ బాధితులను ఆదుకుంటూ ఉన్నారు. అలా యువరాజ్ కు బాలయ్య చేస్తున్న సేవ గురించి తెలుసు. అందుకే బాలయ్య పుట్టినరోజును గుర్తు పెట్టుకుని మరీ విష్ చేశారు యువీ.

61వ పుట్టినరోజు జరుపుకున్నారు బాలయ్య. స్వర్గస్తులైన తన తల్లిదండ్రులు బసవతారకం, నందమూరి తారక రామారావుల ఆశీస్సులతో ఇవాళ తన జన్మదిన వేడుకలను బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సిబ్బందితో కలిసి నిర్వహించినట్టు బాలకృష్ణ సోషల్ మీడియాలో వెల్లడించారు. క్యాన్సర్ రోగులకు మరిన్ని సేవలు అందించేందుకు తగిన శక్తిని పొందినట్టు భావిస్తున్నానని తెలిపారు. ఆసుపత్రిలో భారీ కేక్ కట్ చేసి వైద్యులు, ఇతర సిబ్బంది, క్యాన్సర్ బాధిత చిన్నారులతో పుట్టినరోజును జరుపుకున్నారు బాలకృష్ణ.


సామ్రాట్

Next Story