చనిపోయిన తారల లిస్టులో సిద్ధార్థ్.. యూట్యూబ్ కు ఫిర్యాదు చేస్తే..
Youtube Channel Circulate Fake News About Siddharth. హీరో సిద్ధార్థ్ తెలుగు సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. తమిళనాడుకు చెందిన
By Medi Samrat Published on 19 July 2021 11:36 AM GMT
హీరో సిద్ధార్థ్.. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. తమిళనాడుకు చెందిన సిద్ధార్థ్.. తెలుగులో లవర్ భాయ్ ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. అయితే.. సిద్ధార్థ్ చనిపోయాడంటూ ఓ యూట్యూబ్ ఛానల్ వీడియోను పబ్లిష్ చేసింది. 'చిన్న వయసులోనే మరణించిన 10 మంది దక్షిణాది తారలు' పేరుతో సదరు ఛానల్ ఈ వీడియోను యూట్యూబ్‌లో ఫోస్టు చేసింది. ఈ వీడియో థంబ్‌నైల్లో చనిపోయిన తారలు సౌందర్య, ఆర్తి అగర్వాల్ ఫొటోలతో పాటు సిద్దార్థ్ ఫోటోను కూడా ఉంచారు.
I reported to youtube about this video claiming I'm dead. Many years ago.
They replied "Sorry there seems to be no problem with this video".
ఈ వీడియో చూసిన ఓ సిద్ధార్థ్ అభిమాని ట్విటర్ వేదికగా.. థంబ్‌నైల్ ఫొటోని షేర్ చేస్తూ.. సిద్దార్థ్‌ని ట్యాగ్ చేసి సదరు యూట్యూబ్ ఛానల్ వారిని కడిగిపారేశాడు. 'వ్యూస్ కోసం ఏమైనా చేస్తారా? ఆ థంబ్‌నైల్ ఏంటి?' అంటూ ఫైరయ్యాడు. దీనిపై సిద్దార్థ్ కూడా స్పందించాడు. ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది. నేను చనిపోయానంటూ ఇలా వీడియోలు పెడుతున్నారని యూట్యూబ్‌కి కూడా ఫిర్యాదు చేశాను. వాళ్లేమో 'క్షమించండి.. ఈ వీడియోతో ఎలాంటి సమస్య లేదు అని సమాధానం ఇచ్చారని రాసుకొచ్చాడు. అయితే.. ఫొటోని వాడిని యూట్యూబ్ ఛానల్ వారు.. వీడియోలో సిద్దార్థ్ గురించి ఏం చెప్పకపోవడం కొసమెరుపు. కేవలం వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారంటూ ఫైర్ అవతున్నారు.