ఓటీటీలోకి వచ్చేసిన యాత్ర-2

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించిన మహి వి రాఘవ్ పొలిటికల్ డ్రామా యాత్ర 2 ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది.

By Medi Samrat
Published on : 12 April 2024 6:30 PM IST

ఓటీటీలోకి వచ్చేసిన యాత్ర-2

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించిన మహి వి రాఘవ్ పొలిటికల్ డ్రామా యాత్ర 2 ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ చిత్రం ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. AP అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉండగా.. ఈ చిత్రం OTT లో విడుదల అయింది. యాత్ర సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2 రూపొందింది. సీక్వెల్ మొదటి భాగం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా జీవా, వైఎస్ రాజశేఖరరెడ్డిగా మమ్ముట్టి నటించిన పొలిటికల్ డ్రామా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.

మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన యాత్ర 2019లో విడుదలై మంచి హిట్ గా నిలిచింది. యాత్ర-2 వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని, కాంగ్రెస్ హైకమాండ్ అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన చేపట్టిన పాదయాత్రను చూపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఎలా అయ్యారనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు.

Next Story