త్వరలో ఓటీటీలో విడుదల కానున్న ‘వాల్తేరు వీరయ్య’

'Waltair Veerayya' to be released on OTT soon. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల

By Medi Samrat  Published on  7 Feb 2023 1:15 PM GMT
త్వరలో ఓటీటీలో విడుదల కానున్న ‘వాల్తేరు వీరయ్య’

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయి భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహించారు. రవితేజ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ మూవీ త్వరలో ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఓటీటీలో హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 27న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. చాలా సెంటర్స్ లో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోవడం పట్ల మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సంక్రాంతి తరువాత చాలానే సినిమాలు వచ్చినప్పటికీ, 'వాల్తేరు వీరయ్య'కి పోటీగా నిలిచే స్థాయి సినిమాలు రాలేదు. పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.


Next Story
Share it