రేపే వాల్తేరు వీరయ్య 'టైటిల్ సాంగ్'

Waltair Veerayya Title Song. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘వాల్తేరు వీరయ్య’.

By Medi Samrat  Published on  25 Dec 2022 7:37 PM IST
రేపే వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'వాల్తేరు వీరయ్య'. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ ను అందించాడు. ఆల్బమ్‌ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే పెద్ద హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మూడవ సింగిల్ రాబోతోంది. డిసెంబరు 26న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీని జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'వీరయ్య' అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ను డిసెంబర్‌ 26న రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే రిలీజైన 'బాస్‌ పార్టీ', 'శ్రీదేవి-చిరంజీవి' పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మించింది. రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. చిరంజీవి యూనియన్‌ లీడర్‌గా కనిపించనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.


Next Story