సంగీత దర్శకుడు.. దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల 'ఓ పారి' (తెలుగులో ఓ పిల్లా) అనే ప్రైవేటు ఆల్బమ్ ను రూపొందించారు. ఇందులో 'హరే రామ హరే కృష్ణ' అనే పవిత్ర భజనను ఐటెం సాంగ్ గా మలిచారంటూ దేవిశ్రీ ప్రసాద్ పై ఆరోపణలు వచ్చాయి. పవిత్ర మంత్రాన్ని ఐటెం సాంగ్ గా చిత్రీకరించిన దేవిశ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి.
తాజాగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ దేవిశ్రీప్రసాద్ ను హెచ్చరించింది. ఇతర మతాల దేవుళ్లను కించపరిస్తే వారు తలలు తీసేస్తారని, తమకు అలాంటి అవకాశం కల్పించొద్దని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. హిందూ దేవుళ్లను కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని సినిమాల్లో కూడా దేవుళ్లను కించపరుస్తూ గీతాలు రాస్తున్నారని, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా అదే చేశాడన్నారు. హిందూ దేవళ్లకు అశ్లీలతతో కూడిన సంగీతాన్ని అందించారని, దీనిపై తాము ఇప్పటకే 50కి పైగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశామని విశ్వహిందూ పరిషత్ సభ్యులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నామని.. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ యావత్ హిందువులకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.