రానా బ‌ర్త్‌డే స‌ర్‌ఫ్రైజ్ వ‌చ్చేసింది.!

Virata Parvam First Look Release. భాష‌తో సంబంధం లేకుండా దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టుడు ద‌గ్గుపాటి రానా

By Medi Samrat  Published on  14 Dec 2020 4:42 AM GMT
రానా బ‌ర్త్‌డే స‌ర్‌ఫ్రైజ్ వ‌చ్చేసింది.!

భాష‌తో సంబంధం లేకుండా దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టుడు ద‌గ్గుపాటి రానా. రానా ప్ర‌స్తుతం విరాట ప‌ర్వం అనే సినిమా చేస్తున్నాడు. అయితే.. రానా బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చింది. ఇందులో రానా చేతిలో గ‌న్‌తో న‌క్స‌లైట్ అవ‌తారంలో క‌నిపిస్తున్నారు. ఇందులో ర‌వి అన్న అనే న‌క్స‌లైట్ లీడ‌ర్‌గా రానా సంద‌డి చేయ‌నున్నాడ‌ని టాక్‌. అలాగే.. మ‌రి కొద్ది నిమిషాల‌లో మూవీకి సంబంధించి టీజ‌ర్ కూడా విడుద‌ల చేసి డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌నుంది.ఇదిలావుంటే.. విరాటపర్వం చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో న‌‌టిస్తుండ‌గా.. నివేదా పెతురాజ్ కూడా‌ కీలక పాత్ర పోషిస్తోంది. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల్ని మేళవిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు .

ఈ సినిమాలో.. ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావ్‌, సాయిచంద్‌, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. వ‌చ్చే ఏడాది మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్‌.Next Story