దళపతి విజయ్ ను అలా కూడా విమర్శిస్తూ ఉన్నారు.!
Vijay’s ‘Beast’ controversy. శంకర్ దర్శకత్వంలో 'రోబో'.. సినిమా వచ్చినప్పుడు ఓ వివాదం తమిళనాడులో పెద్ద ఎత్తున
By Medi Samrat Published on 27 Jun 2021 5:42 PM ISTశంకర్ దర్శకత్వంలో 'రోబో'.. సినిమా వచ్చినప్పుడు ఓ వివాదం తమిళనాడులో పెద్ద ఎత్తున ఎగసింది. అంత గొప్ప సినిమాను తమిళ దర్శకుడు తీస్తే వివాదం ఎందుకు వచ్చిందంటారా.. పేరు ఇంగ్లీష్ లో ఉందని..! ఆ తర్వాత తమిళ్ కు తగ్గట్టుగా పేరును మార్చి విడుదల చేశారు.
ఇప్పుడు ఇదే పాయింట్ మీద ఇళయదళపతి విజయ్ ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విజయ్ సినిమాల టైటిల్స్ ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటున్నాయట..! అందుకు కారణంగా సర్కార్, మాస్టర్ సినిమాలను చూపిస్తూ ఉన్నారు. అలాగే రాబోయే సినిమా 'బీస్ట్' గురించి కూడా దాన్నే పాయింట్ అవుట్ చేస్తూ ఉన్నారు.
ఊహించని విధంగా విజయ్ సినిమాల టైటిల్స్ కూడా కొత్త కాంట్రర్సీలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. తమిళనాట సినీ అభిమానులకు ఉన్న భాషాభిమానం ఓవైపు.. విజయ్ అంటే గిట్టని బ్యాచ్ మరో వైపు కావాలనే కాంట్రవర్సీ చేస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలో సినిమాలకు తమిళ టైటిల్స్ పెడితే రాయితీలను ఇస్తున్నా కూడా విజయ్ మార్కెట్ ను బట్టి పెద్దగా పట్టించుకోలేదు నిర్మాతలు. సినిమాకు యాప్ట్ అయ్యే టైటిల్ తోనే థియేటర్ల లోకి దింపుతూ ఉన్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా విజయ్ ను విమర్శించడమే పనిలో పెట్టుకున్నారు కొందరు. అంతకుముందు విజయ్ సినిమాలకు తమిళ టైటిల్స్ నే పెట్టారు. ఇప్పుడు విజయ్ మార్కెట్ ఇతర భాషల్లో కూడా పెరిగిపోతూ ఉండడంతో సినిమాకు సెట్ అయ్యే టైటిల్స్ పెట్టాల్సి వస్తోంది.