ప్రభుత్వాల తప్పులు గురించి సినిమాలు తీసే విజయ్ పన్ను ఎగ్గొట్టాడా..?

Vijay fined Rs 1 lakh by Madras HC for challenging entry tax on Rolls Royce Ghost. ఇళయ దళపతి విజయ్ తీసే సినిమాల్లో సామాజిక

By Medi Samrat
Published on : 13 July 2021 6:03 PM IST

ప్రభుత్వాల తప్పులు గురించి సినిమాలు తీసే విజయ్ పన్ను ఎగ్గొట్టాడా..?

ఇళయ దళపతి విజయ్ తీసే సినిమాల్లో సామాజిక అంశాలను చేరుస్తూ ఉంటారు. ఎంతో బాధ్యతగా ఉండాలని చెప్పే విజయ్ కు మద్రాసు హై కోర్టు చీవాట్లు పెట్టింది. విజ‌య్ 2012లో ఇంగ్లండ్‌లో ల‌గ్జ‌రీ కారును (రోల్స్ రాయిస్‌) కొనుగోలు చేసి భార‌త్‌కు దిగుమ‌తి చేసుకున్నాడు. ఆ కారు దిగుమ‌తికి సంబంధించి భార‌త ప్ర‌భుత్వానికి పన్ను చెల్లించ‌లేదు. పైగా త‌న కారుపై దిగుమ‌తి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుతూ మ‌ద్రాస్ హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. ఆ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం కొట్టివేసింది. అంతేగాక ప‌న్ను త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసినందుకు రూ.ల‌క్ష జ‌రిమానా కూడా విధించింది.

విజయ్ కి పెద్ద సంఖ్యలో అభిమానుల బృందాలు ఉన్నాయని తమిళనాడు వంటి రాష్ట్రంలో ఆ అభిమానులు ఇలాంటి నటులను నిజమైన హీరోలుగా చూస్తారని.. అలాంటి నటులు నిజజీవితంలో మాత్రం 'రీల్ హీరో' లాగా ప్రవర్తించాలని అనుకోరని విమర్శించారు. పన్ను ఎగవేతను దేశ వ్యతిరేక అలవాటు, ఇలాంటి వైఖరి, మనస్తత్వం రాజ్యాంగ విరుద్ధం అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో తెలిపారు. ధనికులు, పేరున్న వ్యక్తులు పన్ను చెల్లించడంలో విఫలమవుతున్నారని న్యాయమూర్తి ఆరోపించారు.

కారు దిగుమతికి సంబంధించి ఇంత వరకు ఆయన భారత ప్రభుత్వానికి పన్ను చెల్లించలేదు. దిగుమతి పన్ను నుంచి మినహాయింపును ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో 2012లో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు దాన్ని కొట్టివేసింది. పన్ను చెల్లించాల్సిందేనని విజయ్ ని ఆదేశించింది. పన్ను కట్టకుండా తప్పించుకునేందుకు యత్నించినందుకు రూ. లక్ష జరిమానా విధించింది. ప్రభుత్వ తప్పులు గురించి సినిమాలు తీసే విజయ్ పన్ను ఎగ్గొట్టాడా అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తూ ఉన్నాయి.


Next Story