విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్ వైరల్
Vijay Deverakonda strips down to nothing in new 'LIGER' poster. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా ప్రమోషన్స్ ను ఊహించని
By Medi Samrat Published on 2 July 2022 5:19 PM ISTవిజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా ప్రమోషన్స్ ను ఊహించని రేంజిలో మొదలుపెట్టారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటించిన 'లైగర్' మూవీపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 'నటన పరంగా మానసికంగా, శారీరకంగా ఈ సినిమా కోసం నా సర్వస్వం పెట్టాను. ఇది ఎంతో ఛాలేంజింగ్ రోల్. నేను మీకు అన్ని ఇస్తాను. త్వరలో లైగర్ వచ్చేస్తుంది' అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ నగ్నంగా ఉండి మధ్యలో రోజా పూలు అడ్డుపెట్టుకుని కనిపించాడు. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలువురు బాలీవుడ్ టు టాలీవుడ్ సెలెబ్రిటీలు షేర్ చేస్తూ వస్తున్నారు.
A Film that took my everything.
— Vijay Deverakonda (@TheDeverakonda) July 2, 2022
As a performance, Mentally, physically my most challenging role.
I give you everything!
Coming Soon#LIGER pic.twitter.com/ljyhK7b1e1
విజయ్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న సినిమా లైగర్. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ తన బ్యానర్‌పై సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఫోటోలో, 'సాలా క్రాస్‌బ్రీడ్' అని రాసి ఉంది. ఈ నగ్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోను నిర్మాత కూడా అయిన కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.