రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా
మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్ దేవరకొండకు ఓ హిట్ చాలా అవసరం.
By Medi Samrat Published on 27 Dec 2024 7:48 PM ISTమంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్ దేవరకొండకు ఓ హిట్ చాలా అవసరం. భారీ అంచనాల మధ్య విజయ్ దేవరకొండ 12వ సినిమా తెరకెక్కుతోంది. VD12 ప్రకటించినప్పటి నుండి అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. 28 మార్చి 2025న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు నిర్మాత నాగ వంశీ వెల్లడించారు.
విజయ్ దేవరకొండ నటించిన VD12 రెండు భాగాలుగా విడుదల చేస్తామని నాగ వంశీ తెలిపారు. ఈ చిత్రం రెండు భాగాల ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేశారని, కథను విభజించినా స్క్రిప్ట్ చెక్కుచెదరకుండా అలాగే ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రొడక్షన్ సమయంలో రెండు భాగాలుగా విభజించాలని అనుకోలేదు, కానీ స్క్రిప్ట్ దశలోనే రెండు భాగాలుగా అభివృద్ధి చేశారన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు