టాలీవుడ్‌లో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌

Vedam Nagaiah Passed Away. టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ న‌టుడు వేదం నాగ‌య్య క‌న్నుమూశారు.

By Medi Samrat  Published on  27 March 2021 9:23 AM GMT
టాలీవుడ్‌లో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ న‌టుడు వేదం నాగ‌య్య క‌న్నుమూశారు. ‌వేదం సినిమాలో కీలక పాత్ర పోషించిన నాగయ్య కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ‌య్య పోషించిన పాత్ర‌కు మంచి పేరు వచ్చింది. వేదం త‌ర్వాత నాగయ్య దాదాపు 30 సినిమాలలో నటించారు.

ఇటీవ‌ల నాగయ్య భార్య చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి నాగయ్య కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్ర‌మంలోనే నాగయ్య ఆరోగ్య‌ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ నేఫ‌థ్యంలోనే మా అసోసియేషన్ పింఛన్ ఇస్తూ నాగ‌య్య కుటుంబానికి అండగా నిలిచింది. ఈ మధ్య నాగయ్య ఆరోగ్యం మ‌రింత‌ క్షీణించడంతో శ‌నివారం తుది శ్వాస విడిచారు. లేటు వ‌య‌స్సులో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన నాగ‌య్య త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. నాగయ్య మృతి పట్ల ప‌లువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


Next Story