మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం.. మరో హీరోకు కరోనా పాజిటివ్
Varun Tej Tested Covid-19 Positive. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతకొంతకాలంగా కేసుల సంఖ్య తగ్గినప్పటికి
By Medi Samrat Published on 29 Dec 2020 7:00 PM ISTదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతకొంతకాలంగా కేసుల సంఖ్య తగ్గినప్పటికి ఈ మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అంతా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు సినీప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మెగా ఫ్యామిలో కరోనా కలకలం రేపింది.
తనకు కరోనా సోకినట్టు ఈ రోజు ఉదయం రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు మాత్రం తనలో లేవని.. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నానని వెల్లడించాడు. ఇంకా ఈ షాక్ నుంచి మెగా అభిమానులు కోలుకోకముందే.. మరో ఆందోళనకర వార్త వెల్లడైంది. మరో మెగా హీరో కూడా కరోన బారిన పడ్డారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 29, 2020
తనకు కరోనా పాజిటివ్ అని ఈ ఉదయం నిర్ధారణ అయిందని వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. స్వల్పస్థాయిలో తనలో కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. తాను కూడా ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. త్వరలోనే తిరిగి వస్తానని.. మీప్రేమకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు వరుణ్ తేజ్.
వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు ఎప్ 3లో సందడి చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఒకే రోజు ఇద్దరు మెగా హీరోలు కరోనా బారిన పడడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.