ఆ సినిమా రిజల్ట్.. బాగా హర్ట్ అయిన వరుణ్ తేజ్

Varun Tej Reacts About Ghani Movie Result. వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'ఘనీ'.. గత శుక్రవారం సినిమా విడుదల అయ్యింది.

By Medi Samrat  Published on  12 April 2022 3:07 PM GMT
ఆ సినిమా రిజల్ట్.. బాగా హర్ట్ అయిన వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'ఘనీ'.. గత శుక్రవారం సినిమా విడుదల అయ్యింది. సినిమాలో భారీ తారాగణం ఉన్నప్పటికీ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది. ముఖ్యంగా రొటీన్ సబ్జెక్ట్ అంటూ మొదటి ఆటకే టాక్ రావడంతో.. వరుణ్ తేజ్ పడ్డ కష్టం మొత్తం వృధా అయింది. సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుందనే టాక్ నడుస్తూ ఉంది. తాజాగా వరుణ్ తేజ్ అభిమానుల కోసం ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. "ఇంత కాలంగా మీ ప్రేమను .. ఎఫెక్షన్ ను నాపై చూపించినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. 'గని' మేకింగ్ లో పాలుపంచుకున్న వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఎంతో ఫ్యాషన్ తో ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేశాము. కానీ ఎక్కడో మా ఐడియా మేము అనుకున్నట్టుగా రీచ్ కాలేదు. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే అనుకుంటాను. ఆ ప్రయత్నంలో కొన్ని సార్లు నేను సక్సెస్ అవుతాను .. కొన్ని సార్లు నేర్చుకుంటాను .. కానీ కష్టపడం మాత్రం ఎప్పటికీ ఆపను" అని తెలిపాడు.

అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాతో, కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'ఎఫ్ 2' , ' గద్దలకొండ గణేశ్' లాంటి రెండు భారీ హిట్ల తర్వాత వరుణ్ తేజ్ సినిమా వచ్చినా కూడా ప్రేక్షకుల నుండి స్పందన కరువైంది. 'ఘనీ' OTT రిలీజ్‌కి సంబంధించి ఓ అప్డేట్ బయటకొచ్చింది. థియేటర్స్‌లో ఈ మూవీ రిలీజ్ అయిన మూడు వారాలకు ఏప్రిల్‌ 29నుంచి ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.
Next Story
Share it