నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్. ఈ చిత్రం విడుదలకు దగ్గరవడంతో మళ్లీ వర్మ హడావుడి మొదలైంది. గతంలో ఈ సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆపాలంటూ అమృత కోర్టు మెట్లెక్కారు. అయితే.. సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతీరావు, అమృత ఇన్సిడెంట్ జరిగినప్పుడు తాను కూడా నెగిటివ్‌గా రియాక్ట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘటన వెనుక అసలు నేపథ్యాన్ని తర్వాత కనుగొన్నట్లు చెప్పారు. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఉండాల్సిన రిలేషన్ గురించి చాలా స్టడీ చేశానని వివరించారు. 'మర్డర్' సినిమా.. మారుతీరావు కథకు సంబంధించింది కాదని ..ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అన్నారు. అసలు విషయం తెలియక కోర్టుకెక్కారని.. కుటుంబ గౌరవాన్ని చెడగొడ్తున్నారన్న భావోద్వేగాలు మానవ సహజం అని వ్యాఖ్యానించారు.
రేపు (డిసెంబర్ 22న) మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ ఎదుట ప్రెస్ మీట్ పెట్టాలని డిసైడ్ అయ్యామని.. అయితే అక్కడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామన్నది అప్పుడే చెబుతానన్నారు రాంగోపాల్ వర్మ.