ఐదోసారి ప్రేమలో పడిన నటి..?
Vanitha Vijayakumar is in love again. ప్రేమ.. జీవితంలో ఓ సారే పుడుతుందని.. పెళ్లిచేసుకుని ఆ వ్యక్తితోనే జీవితాంతం
By Medi Samrat Published on 18 Dec 2020 12:51 PM IST
ప్రేమ.. జీవితంలో ఓ సారే పుడుతుందని.. పెళ్లిచేసుకుని ఆ వ్యక్తితోనే జీవితాంతం ఉండాలని అనిపిస్తుందని అంటారు చాలా మంది. మరీ ఈ నటి మాత్రం అందుకు మినహాయింపు లేండి. ఎందుకంటే.. అమ్మడు తన జీవితంలో 4 సార్లు ప్రేమలో పడింది.. ముగ్గురిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చింది. తాజాగా ఐదో సారి కూడా ప్రేమలో పడిందట. ఆమె ఎవరో కాదు.. తమిళ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్ కుమార్.
ప్రముఖ నటుడు విజయ్ కుమార్, దివంగత నటి మంజుల కూతురు ఈమె. తెలుగులో దేవి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. అయినా.. నిత్యం ఎదో వివాదంతో వార్తల్లో నానుతూనే ఉంటుంది. మూడు పెళ్లిళ్లు చేసుకొని కూడా.. ఎవరితోనూ ఎక్కువ రోజులు కాపురం చేయలేదు. ఏదో ఒక గొడవలతో వారితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఓ వ్యక్తితో కొద్దికాలం రిలేషన్‌తో ఉంది. అది కూడా వర్కర్ కాలేదు. తాజాగా ఈ అమ్మడు ఐదో సారి ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెప్పేసింది. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను. నీవు చాలా సంతోషంగా ఉన్నావని అనుకొంటా అంటూ.. తమిళ నటి ఉమ రియాజ్ ఖాన్‌ను ట్యాగ్ చేసి పోస్టు చేసింది. దాంతో అమ్మడు నాలుగో పెళ్లికి సిద్దమైందా అంటూ నెటీజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. దీంతో కామెంట్ల బాక్స్‌ను బ్లాక్ చేయడం గమనార్హం. మరీ ఆ వ్యక్తి ఎవరో అన్న కామెంట్లు వస్తున్నాయి. ఆమె చెప్పే వరకు అతను ఎవరో తెలీదులెండీ.
ఇదిలావుంటే.. వనిత 2000 సంవత్సరంలో నటుడు ఆకాశ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. ఏడేళ్ల కాపురం తర్వాత 2007లో అతడితో విడాకులు తీసుకుంది. ఆ తరువాత అదే సంవత్సరం వ్యాపారవేత్త జయ్ రాజన్‌ను వనితా రెండో పెళ్లి చేసుకుంది. ఆయనతో కూడా ఐదేళ్లు కాపురం చేసిన తర్వాత 2012 సంవత్సరంలో విడిపోయింది. ఇక ఆ తరువాత ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్‌తో నాలుగేళ్ల పాటు రిలేషన్‌లో ఉంది వనితా. 2017లో ఈయనతో కూడా విడిపోయింది.
ఇక లాక్‌డౌన్ సమయంలో జూన్ 27న దర్శకుడు పీటర్ పాల్‌ని ఆమె మూడో వివాహం చేసుకుంది. అయితే వీళ్ళ పెళ్లిపై కూడా పెద్ద రచ్చ జరిగింది. తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్.. వనితాను పెళ్లి చేసుకున్నాడని అతడి మొదటి భార్య ఎలిజిబెత్ ఆరోపణలు చేయడమే కాకుండా పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు వనితాపై విమర్శలు చేశారు. కావాలనే పీటర్ మొదటి భార్య తనపై విమర్శలు చేస్తోందని వనిత విరుచుకుపడింది. ఆ తర్వాత ఈ ఇద్దరు కూడా విడిపోయారు. పెళ్ళయిన కొన్ని నెలలకే వనితను వదిలేసాడు పీటర్. తనకంటే మద్యం అంటేనే పీటర్ కు చాలా ఇష్టమని.. అతడి కోసం తాను చాలా వదులుకున్నానని.. కానీ తనను వదిలేసి వెళ్లాడంటూ వనితా చెప్పుకొచ్చింది.