వచ్చేసిన వకీల్ సాబ్ అప్డేట్..!

Vakeel Saab Movie Update. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ మార్చి 29న విడుదల చేయనున్నారు.

By Medi Samrat
Published on : 24 March 2021 5:27 PM IST

Vakeel Saab Movie Update
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా 'వకీల్ సాబ్'..! హిందీలో లేడీ ఓరియెంట్ సినిమా అయినప్పటికీ.. తెలుగుకు వచ్చేసరిగా పవన్ కళ్యాణ్ మీదనే కాన్సంట్రేట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఓ అప్డేట్ ఇస్తామని చెప్పిన వకీల్ సాబ్ చిత్ర బృందం.. అనుకున్న సమయానికే అప్డేట్ ఇచ్చేసింది.


ఇంతకూ ఆ అప్డేట్ ఏమిటంటే.. వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ గురించి. మార్చి 29న వకీల్ సాబ్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. వకీల్ సాబ్ ఏప్రిల్ 9 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా నివేతా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వకీల్ సాబ్ డిజిటల్ రైట్స్ తో పాటు.. శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ను తీసుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసింది.

పవన్ కళ్యాణ్ ఈ సినిమా తర్వాత క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే పేరును ఖరారు చేసారు. హరిహర వీరమల్లు సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే సినిమా టీజర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు భీభత్సమైన కిక్ ఇచ్చింది. తాము ఇలాంటి పోరాటయోధుడిగా పవన్ కళ్యాణ్ ను అసలు ఊహించలేదని అభిప్రాయాలను పంచుకున్నారు



Next Story