బాలయ్య సందడి షురూ.. మోహన్ బాబుకు చిరంజీవి గురించి షాకింగ్ ప్రశ్న

Unstoppable Episode 1 Promo Released. నందమూరి బాలకృష్ణ ఓ టాక్ షో చేస్తున్నారనే విషయమే ఓ సెన్సేషన్..! మొదట ఎవరూ

By Medi Samrat  Published on  31 Oct 2021 3:42 PM IST
బాలయ్య సందడి షురూ.. మోహన్ బాబుకు చిరంజీవి గురించి షాకింగ్ ప్రశ్న
నందమూరి బాలకృష్ణ ఓ టాక్ షో చేస్తున్నారనే విషయమే ఓ సెన్సేషన్..! మొదట ఎవరూ నమ్మలేదు కానీ.. ఆ తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం.. ప్రోమో రిలీజ్ చేస్తూ ఈవెంట్ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇక దీపావళికి మొదటి ఎపిసోడ్ ను కూడా సిద్ధం చేసేసారు 'ఆహా' టీమ్. ఇక బాలయ్య చేస్తున్న షో 'అన్ స్టాపబుల్' మొదటి ఎపిసోడ్ ప్రోమో కూడా విడుదలైంది. నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మ‌న‌సు..' అంటూ బాల‌కృష్ణ ఓటీటీలోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేశారు. నవంబర్ 4 నుండి ప్రసారం కానున్న కార్య‌క్ర‌మంలో బాల‌కృష్ణ మస్త్ సందడి చేయనున్నారు.


ఇందులో మంచు కుటుంబంతో బాలయ్య మాంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడని పక్కాగా అర్థం అయిపోయింది. 'ఎవ‌రి జీవితం క‌ళాప్ర‌పూర్ణ‌మో... ప్ర‌జ‌ల సేవ సంపూర్ణ‌మో ఆయ‌నే..' అంటూ మోహ‌న్ బాబును బాల‌కృష్ణ పిల‌వ‌బోయారు. అంత‌లోనే మోహ‌న్ బాబు షోలో అడుగుపెట్టారు. దీంతో బాల‌కృష్ణ‌... 'చాద‌స్తం... ఇంట్ర‌డ‌క్ష‌న్ కాకుండానే వ‌చ్చాస్తారు' అని చుర‌క‌లంటించారు. మోహ‌న్ బాబుని ఈ షోలో బాల‌య్య ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. ఏంటింకా ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా ఉన్నారు? అని అడగ్గా.. మోహన్ బాబు ఎవ‌రికి వ‌య‌సైంది.. నీకైంది వ‌య‌సు అనగానే బాల‌కృష్ణ ప‌ద‌హారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక మీరు న‌టించిన సినిమాల్లో అస్సలు చూసుకోలేని సినిమా ఏది? అని బాలయ్య మోహన్ బాబును అడుగగా.. మోహ‌న్ బాబు ప‌టాలం పాండు అని సమాధానం చెప్పారు. బాల‌కృష్ణ‌ వెంటనే బాగా రాడ్ రంభోలా? అంటూ నవ్వులు పూయించారు. ఇక చిరంజీవికి సంబంధించిన ప్రశ్నను కూడా మోహన్ బాబుతో అడగడం.. రాత్రి ఏడున్నర తర్వాత తాగే వాటి గురించి అడగడం.. ఇలా చాలా వాటిని ప్రోమోలో ఉంచారు. మీరు కూడా చూసేయండి..


Next Story