ముద్దు వివాదంపై స్పందించిన 69 సంవత్సరాల సింగర్

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లో తన అభిమానిని ముద్దుపెట్టుకున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.

By Medi Samrat  Published on  1 Feb 2025 5:13 PM IST
ముద్దు వివాదంపై స్పందించిన 69 సంవత్సరాల సింగర్

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లో తన అభిమానిని ముద్దుపెట్టుకున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.అయితే ఆయన ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీడియోలో ఆయన తన అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఓ మహిళ ఆయనను ముద్దుపెట్టుకోవడం కోసం వచ్చింది. ఇంతలో ఆయన కూడా ముద్దు పెట్టాడు.

ఈ వీడియోపై ఉదిత్ నారాయణ్ స్పందించారు. హిందుస్థాన్ టైమ్స్‌తో ఉదిత్ వైరల్ వీడియో గురించి మాట్లాడారు. అభిమానుల‌కు నేనంటే చాలా ఇష్టం. కొంత‌మంది క‌ర‌చాల‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే, మ‌రికొంత మంది కిస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. అదంతా కేవ‌లం ఆత్మీయ‌త‌తో కూడుకున్న విషయం. స‌మాజంలో ఎంతో పేరు, మ‌ర్యాద క‌లిగిన వ్య‌క్తిని తానని తెలిపారు. అభిమానుల‌తో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించే ఉద్దేశం ఎప్పటికీ లేదని స్పష్టం చేశారు. వివాదాల‌కు దూరంగా ఉంటానని, కొంత‌మంది కావాల‌నే దీన్ని వివాదంగా చూస్తున్నారని ఉదిత్ నారాయణ్ తేల్చి చెప్పారు. అభిమానులు తమకు కలిసే అవకాశం లభిస్తోందని అనుకుంటారు, కొందరు కరచాలనం కోసం ఎగబడతారు, మరికొందరు ముద్దుపెట్టుకుని అభిమానం చూపుతారు. ఇలాంటి విషయాలపై అంతగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు.

Next Story