మరో మాస్ జాతరకు సిద్ధమవ్వడమే.. కేజీఎఫ్-2 ట్రైలర్ వచ్చేది అప్పుడే..
Trailer Of Yash’s Magnum Opus To Be Released On March 27. 'K.G.F: చాప్టర్ 2' గ్రాండ్ రిలీజ్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది. అభిమానులు ఈ సినిమాకు సంబంధించి
By Medi Samrat Published on 3 March 2022 1:03 PM IST'K.G.F: చాప్టర్ 2' గ్రాండ్ రిలీజ్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది. అభిమానులు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కు సంబంధించి ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. పాన్ ఇండియా సినిమాగా భారీ విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ చిత్ర బృందం ఈరోజు షేర్ చేసింది. ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ వెల్లడించడంతో అభిమానుల వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పడ్డట్టేనని అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా దర్శకుడు ప్రశాంత్ నీల్ అతడి బృందం 'కేజీఎఫ్: చాప్టర్ 2' మార్చి 27న సరిగ్గా సాయంత్రం 6:40 గంటలకు విడుదలవుతుందని ప్రకటించారు. 'K.G.F: చాప్టర్ 2' ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా', తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం 'బీస్ట్' కూడా అదే రోజు విడుదల కానుంది.
There is always a thunder before the storm!#KGFChapter2 Trailer on March 27th at 6:40 pm.
— Prashanth Neel (@prashanth_neel) March 3, 2022
Stay Tuned: https://t.co/grk8SQMTJe@Thenameisyash @VKiragandur @hombalefilms @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @bhuvangowda84 @RaviBasrur
#KGF2TrailerOnMar27 pic.twitter.com/CYcWx9vK1j
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. సెకండ్ పార్ట్ ను మొదటి భాగం కంటే గ్రాండ్ గా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. గత ఏడాది సినిమా విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ పాన్ ఇండియా రేంజి సినిమా కరోనా కారణంగా 2022 సంవత్సరానికి వాయిదా పడింది. కేజీఎఫ్ 2 చిత్రాన్ని గతేడాది జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర దర్శక నిర్మాతలు మొదట భావించారు. ఆ తర్వాత డిసెంబర్‌లో విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అది ఏప్రిల్ 14,2022న కేజీఎఫ్ 2 చిత్రం విడుదలకు ఫిక్స్ చేశారు. కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో 'సలార్' సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.