పేర్ని నానితో భేటీ అయిన టాలీవుడ్ నిర్మాతలు

Tollywood Producers Meet With Perni Nani. ఓ వైపు పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ నేతలు అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. ఆంధ్రప్రదేశ్

By Medi Samrat  Published on  29 Sep 2021 12:19 PM GMT
పేర్ని నానితో భేటీ అయిన టాలీవుడ్ నిర్మాతలు

ఓ వైపు పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ నేతలు అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ఆదుకోవడం లేదని.. తన సినిమా వల్లనే చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం వేధిస్తోందని చెబుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటికి సినీ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు వెళ్లారు. నిర్మాతలు వస్తున్నట్టు నిన్ననే పేర్ని నానికి మధ్యవర్తులు సమాచారం పంపించారు. కాసేపటి క్రితం వీరంతా మంత్రి ఇంటికి వెళ్లారు.

నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్, వంశీరెడ్డి, మైత్రి నవీన్ కలిసి మచిలీపట్నం వెళ్లారు. అక్కడ మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యారని మీడియాలో తెలిపారు. ఆన్ లైన్ టికెట్ల అమ్మకంతోపాటు సినీ ఇండస్ట్రీలో సమస్యలపై మంత్రితో చర్చించారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో నిర్మాతల బృందం వెళ్లి పేర్నినానిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 20న ఏపీ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులు మంత్రి పేర్నినానితో చర్చలు జరిపారు. టాలీవుడ్‌ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై చర్చించారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలను అడిగి తెలుసుకున్న మంత్రి పేర్ని నాని త్వరలోనే సీఎం జగన్‌తో చర్చించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.


Next Story
Share it