పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు

Tollywood Producers Meet With Pawan Kalyan. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు.

By Medi Samrat  Published on  1 Oct 2021 11:38 AM GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. రిపబ్లిక్ ఆడియో రిలీజ్ రోజు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత పలువురు నిర్మాతలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. తమ సమస్యలను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చిందని.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వ్యక్తిగతం అని నిర్మాతలు చెప్పారు. తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

టాలీవుడ్ అగ్ర నిర్మాతలు నేడు పవన్ కళ్యాణ్ ను కలిశారు. దిల్ రాజు, డీవీవీ దానయ్య, వంశీ రెడ్డి, నవీన్ ఎర్నేని, సునీల్ నారంగ్, బన్నీ వాసు నేడు పవన్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు, సమస్యలపై వారు పవన్ తో చర్చించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ శ్రమదాన వేదికను జనసేన పార్టీ మార్చింది. ఏపీలోని రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతూ రేపు రాజమండ్రి కాటన్ బ్యారేజీపై శ్రమదానం నిర్వహిస్తానని పవన్ ప్రకటించారు. అందుకు ఇరిగేషన్ అధికారులు ఒప్పుకోలేదు. దీంతో కార్యక్రమాన్ని హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చారు. కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం శ్రమదానం చేస్తారని పార్టీ వెల్లడించింది.


Next Story