మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంతో చర్చలు సంతోషం అన్నారు. మా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఆక్సిజన్ ఇచ్చారని తెలిపారు. అతి త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తా అన్నారని.. సీఎం జగన్ మంచి భరోసా ఇస్తున్నారన్నారు. ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉందని.. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ కావాలని మేమే ఆడిగామని తెలిపారు. అన్ని సినిమా సమస్యలపై మంత్రి పేర్ని నాని బాగా స్పందించారని.. తెలుగు సినిమా అన్ని సెక్టార్లు, 24 క్రాఫ్ట్ కు సంబంధించి సమస్యల పరిష్కారానికి మంచి హామీ ఇచ్చారని అన్నారు.
నిర్మాత ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ టికెట్ విధానం ఉందని.. ఏపీలో కూడా అమలు జరపాలని కోరామన్నారు. సినిమా టికెట్ రేట్లు సవరించాలని మేము ఆడిగామని.. సినీ పరిశ్రమకు సంబంధించి అన్ని అంశాలపై ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. మరో నిర్మాత డి.ఎన్.వి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సినిమా సమస్యల పై సానుకూలంగా స్పందించిందన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుందన్నారు. పెద్ద, చిన్న సినిమా లేదు.. ప్రభుత్వం దగ్గర ఉన్న డౌట్స్ క్లారిఫై చేసామన్నారు. సినిమా పరిశ్రమకు ఉన్న సమస్యలపై మంత్రి పేర్ని నాని అధికారులతో చర్చ జరిగిందని.. తప్పనిసరిగా మరొక సమావేశం ఉంటుందని అన్నారు.