రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో షాద్ నగర్ పట్టణంలోని పరమేశ్వర ధియేటర్ నుండి తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధికి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ..తాము చేపట్టిన సంకల్ప యాత్ర ఏ పార్టీకి సంబంధం లేదు మొక్కుకున్న మొక్కు తీర్చుకోవడానికి యాత్ర చేపట్టాను అని అన్నారు..
ఇది ఇలా ఉండగా వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన సందర్భంలో మనస్థాపంతో తిరుమల వెంకటేశ్వర స్వామికి పాదయాత్రతో వస్తానని మొక్కుకున్నారు. స్వామి దయతోనే చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదలవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో అత్యద్భుతమైన మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని నెలకొల్పారన్నారు. ఈ సంకల్పయాత్ర కేవలం తన మొక్కు కోసమేనని రాజకీయ లబ్ధి కోసం కాదని నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు.