టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు

Tollywood Drug Case. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మరుగున పడిపోయిందనుకున్న

By అంజి  Published on  28 Aug 2021 3:32 AM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు

ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులను విచారించిన ఈడీ

కెల్విన్, పీటర్, కమింగా నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఈడీ

ముగ్గురి స్టేట్‌మెంట్ల ఆధారంగా విచారణను తీవ్రతరం చేసిన ఈడీ

హవాల రూపంలో డబ్బులు చెల్లించినట్లు తెలిపిన ముగ్గురు నిందితులు

విదేశాల నుంచి డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్ తీసుకువచ్చినట్లు తెలిపిన నిందితులు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మరుగున పడిపోయిందనుకున్న కేసును ఈడీ మళ్లీ తెరపైకి తీసుకుచ్చింది. తాజాగా డ్రగ్స్‌ కేసులో జరిగిన మనీ ఎక్ఛేంజ్‌పై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులను ఈడీ విచారించింది. నిందితులు కెల్విన్, పీటర్, కమింగా నుంచి ఈడీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ముగ్గురి స్టేట్‌మెంట్ల ఆధారంగా విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు తీవ్రతరం చేశారు. కెల్విన్ స్టేట్‌మెంట్ ఆధారంగా సినీనటులకు నోటీసులు అందించారు. హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లు ముగ్గురు నిందితులు ఈడీ విచారణలో తెలిసింది. విదేశాల నుంచి డార్క్‌వెబ్‌ ద్వారా డ్రగ్స్ తీసుకువచ్చినట్లు, మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు డబ్బులు పంపినట్లు విచారణలో తేలింది.

హీరో నవదీప్‌కు చెందిన ఎఫ్ క్లబ్‌కు పెద్దమొత్తంలో డ్రగ్స్‌ సరఫరా జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌కు ఈడీ నోటీసులు పంపింది. అయితే విదేశాలకు ఎంత డబ్బు పంపించారు, డబ్బంతా ఎక్కడిది అన్న కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గోవా, హైదరాబాద్ కేంద్రంగా వీదేశీయుల ద్వారానే డ్రగ్స్‌ దందా జరిగినట్లు ఈడీ గుర్తించింది. నిందితుడు కెల్విన్‌కు విదేశాల్లోని డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ప్రధానంగా ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి డ్రగ్స్ సరఫరా జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది.


Next Story
Share it