2020లో కొత్త వ్యాపారాలను ప్రారంభించిన టాలీవుడ్ సెలబ్రిటీస్ వీళ్ళే!

Tollywood Celebrities Who Started Their Own Business. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సెలబ్రిటీస్ ఎంతవరకు వారి

By Medi Samrat  Published on  26 Dec 2020 10:56 AM GMT
2020లో కొత్త వ్యాపారాలను ప్రారంభించిన టాలీవుడ్ సెలబ్రిటీస్ వీళ్ళే!

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సెలబ్రిటీస్ ఎంతవరకు వారి ప్రస్థానాన్ని కొనసాగిస్తారనే విషయం ఎవరికీ తెలియదు. వారు నటించిన సినిమాలు మంచి విజయం సాధించడంతో వారికి కొంత కాలం పాటు అవకాశాలు దక్కుతాయి. అందుకోసమే వారు మంచి ట్రాక్ లో ఉన్నప్పుడు మరోవైపు వ్యాపారాలను కూడా ప్రారంభిస్తుంటారు. ఇలాంటి కోవలో మన తెలుగు సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అయితే ఈ 2020 వ సంవత్సరంలో కొత్తగా వ్యాపారాలను ప్రారంభించిన ఆ సినీ సెలబ్రిటీస్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

సమంత అక్కినేని:

ఈ మధ్య కాలంలో సమంత ఎక్కువగా వివిధ రకాల బ్రాండ్ దుస్తులకు సంబంధించిన యాడ్స్ లో మనకు కనిపిస్తున్నారు. ఒకవైపువరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న సమంత మరొకవైపు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి ద బెస్ట్ బిజినెస్ ఉమెన్ గా పేరు సంపాదించుకోవడం కోసం కష్ట పడుతున్నారు. ఇందులో భాగంగానే "సాకీ" అనే బ్రాండ్ ను ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ సాకీ ద్వారా నేటి తరం అమ్మాయిలకు కావాల్సిన దుస్తులను అందుబాటులోకి తెచ్చారు.

కాజల్ అగర్వాల్:

తెలుగు ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. తన భర్త గౌతమ్ ముంబైలో ప్రముఖ ఇంటీరియర్ డిజైన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కాజల్ అగర్వాల్, గౌతమ్ వీరిద్దరి ప్రేమకు గుర్తుగా 'కిచ్డ్' అనే బ్రాండ్ తో మన ఇంటికి కావలసిన ఇంటీరియర్ డిజైన్స్ తో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. తమ బ్రాండ్ ద్వారా వివిధ రకాల వస్తువులను అందుబాటులోకి తేనున్నారు.

ఆనంద్ దేవరకొండ:

విజయ్ దేవరకొండ సోదరుడైన ఆనంద్ దేవరకొండ "దొరసాని" సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ ద్వారా మంచి విజయాన్ని అందుకున్న ఆనంద్, తన స్నేహితులతో కలిసి ఇటీవలే హైదరాబాద్ లో గుడ్ వైబ్స్ ఓన్లీ అనే కేఫ్ ను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ కేఫ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా సినీ సెలబ్రిటీస్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ, మరోవైపు వ్యాపార రంగం లోకి అడుగుపెట్టారు. వీరే కాక ఇప్ప‌టికే మ‌హేష్ బాబు, రానా, అల్లు అర్జున్ వంటి వారు కూడా బిజినెస్‌ల‌లో దూసుకుపోతున్నారు.Next Story
Share it