మొదటి రోజే కలెక్షన్స్ కొల్లగొట్టేసింది..!

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ అద్భుతమైన రీతిలో మొదలయ్యాయి

By Medi Samrat  Published on  30 March 2024 5:00 PM IST
మొదటి రోజే కలెక్షన్స్ కొల్లగొట్టేసింది..!

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ అద్భుతమైన రీతిలో మొదలయ్యాయి. ఈ చిత్రం అన్ని ప్రాంతాలలో సెన్సేషనల్ నంబర్‌లకు సాధించింది. ఓవర్సీస్‌లో, ఇది ప్రారంభ రోజున $1.2 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. నైజాంలో 3.7 కోట్ల షేర్‌ సాధించింది. నాని దసరా తర్వాత మీడియం-బడ్జెట్ చిత్రాలలో ఆల్ టైమ్ 2వ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా టిల్లు స్క్వేర్ నిలిచింది. టిల్లు స్క్వేర్ రెండో రోజు మరింత కలెక్షన్స్ సాధించబోతోంది. వీకెండ్ నాటికి ఈ చిత్రం బ్రేక్‌ఈవెన్ మార్క్.. 32 కోట్లు సాధించడానికి సిద్ధంగా ఉంది.

టిల్లు స్క్వేర్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 23.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అమెరికాలో కూడా మొదటి రోజే 1 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది. నిర్మాత నాగవంశీ నిన్న సక్సెస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టిల్లు స్క్వేర్ 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అన్నారు. టిల్లు స్క్వేర్ హంగామా చూస్తుంటే ఈజీగానే 100 కోట్లు కొట్టేలా ఉంది. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా మార్చి 29న రిలీజై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సినిమాను నిర్మించారు.

Next Story