ఆర్ఆర్ఆర్ కు వరుసగా గుడ్ న్యూస్ లు..!

Telangana Government Good News For Rrr Team. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మకం చిత్రం 'ఆర్ఆర్ఆర్' విడుదలకు

By Medi Samrat  Published on  19 March 2022 10:36 AM GMT
ఆర్ఆర్ఆర్ కు వరుసగా గుడ్ న్యూస్ లు..!

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మకం చిత్రం 'ఆర్ఆర్ఆర్' విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలబోతోంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్, అలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, శ్రియ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణ థియేటర్లలో తొలి మూడు రోజులకు రూ. 50, ఆ తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అంతేకాదు ఐమ్యాక్స్ థియేటర్లు, స్పెషల్ కేటగిరీ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ. 100, ఆ తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఐదో షో ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ చిత్రం విడుద‌లైన మూడు రోజులు(మార్చి25-మార్చి27) వ‌ర‌కు మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.100 త‌ర్వాత వారం రోజులు(మ‌ర్చి28-ఏప్రిల్3) రూ.50 పెంచుకోవ‌చ్చు. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో మొద‌టి మూడు రోజులు రూ.50, ఆ త‌ర్వాత వారం రోజుల పాటు రూ.30 పెంచుకునే అవ‌కాశం క‌ల్పించింది. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌లైన ప‌ది రోజుల వ‌ర‌కు రోజుకు 5 షోలు వేసుకునే వెస‌లుబాటును తెలంగాణ ప్ర‌భుత్వం కల్పించింది. మూడు రోజుల‌వ‌ర‌కు టిక్కెట్ల ధ‌ర‌ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ.233గా ఉండ‌గా.. మ‌ల్టీప్లెక్స్‌లో రూ.413 ఉండ‌నుంది. ఏపీ ప్ర‌భుత్వం ఈ చిత్రానికి రూ.75 పెంచుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ రేటు చిత్రం విడుద‌లైన 10రోజుల వ‌ర‌కు వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది.

ఈరోజు చిత్రబృందం బెంగళూరు(చిక్ బళాపూర్) లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ రాత్రి బిగ్ ఈవెంట్ జరగనుందని, ఎన్నో సంవత్సరాల తర్వాత అందరినీ కలవబోతున్నామని తెలిపారు. కర్ణాటక సీఎం కూడా ఈ కార్యక్రమానికి వస్తుండడంతో ఎంతో ఉద్విగ్నతకు గురవుతున్నామని అన్నారు.

Next Story
Share it