మరో వెబ్ సిరీస్ తో సందడి చేయనున్న తమన్నా.. రిలీజ్ ఎప్పుడంటే
Tamannah To Tell November Story On May 14. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఇప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టారు. ఇక హీరోయిన్స్ కూడా పలు
By Medi Samrat Published on 4 May 2021 3:58 PM GMT
పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఇప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టారు. ఇక హీరోయిన్స్ కూడా పలు ఓటీటీ ప్లాట్ ఫామ్ ల కోసం వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఉన్నారు. బాలీవుడ్ నుండి సౌత్ ఇండియా హీరోయిన్స్ వరకూ వెబ్ సిరీస్ లలో కనిపిస్తూ ఉన్నారు. తమన్నా భాటియా కూడా వెబ్ సిరీస్ ల విషయంలో స్పీడును పెంచింది.
కొద్దిరోజుల కిందట ఆహా ఓటీటీ కోసం లెవెన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ లో తమన్నా కనిపించిన సంగతి తెలిసిందే..! ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్ పర్వాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో సందడి చేయడానికి తమన్నా సిద్ధమైంది. 'నవంబర్ స్టోరీ' అనే వెబ్ సిరీస్ లో తమన్నా ముఖ్య పాత్ర పోషించింది. డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ రాబోతోంది. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న నవంబర్ స్టోరీ మే 14న విడుదల కానుంది. అనురాధ అనే యువతి పాత్రలో తమన్నా కనిపించబోతుంది. జీఎం కుమార్, పశుపతి, వివేక్ ప్రసన్న నమిత కృష్ణమూర్తి సిరీస్‌లో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆనంద వికటన్ నిర్మిస్తున్న నవంబర్ స్టోరీ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ వెబ్ సిరీస్ అయినా అందరినీ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి..!
తమన్నా ఇటు సినిమాలతో పాటూ.. అటు వెబ్ సిరీస్ లపై కూడా కన్నేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక సినిమాలో.. బాలీవుడ్ లో ఇంకో సినిమాలో తమన్నా కనిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న 'ఎఫ్ 3' పై తమన్నా భారీగా ఆశలు పెట్టుకుంది.