బోల్డ్ సినిమాకు ఓకే చెప్పిన తమన్నా

తెలుగులో భోళా శంకర్‌ సినిమాలో చివరిగా కనిపించిన తమన్నా.. తన తదుపరి తెలుగు సినిమా ప్రాజెక్ట్ పై సంతకం చేసింది.

By Medi Samrat  Published on  1 March 2024 9:49 PM IST
బోల్డ్ సినిమాకు ఓకే చెప్పిన తమన్నా

తెలుగులో భోళా శంకర్‌ సినిమాలో చివరిగా కనిపించిన తమన్నా.. తన తదుపరి తెలుగు సినిమా ప్రాజెక్ట్ పై సంతకం చేసింది. క్రైమ్ థ్రిల్లర్ 'ఓదెల 2' సినిమాలో ఆమె కనిపించనుంది. అశోక్ తేజ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ చిత్రం 2022లో నేరుగా OTTలో విడుదలైన ఒదెలా రైల్వే స్టేషన్‌కి సీక్వెల్. మొదటి భాగంలో హెబ్బా పటేల్ నటించారు. కొన్ని బోల్డ్ సీన్లు ఈ సినిమాలో ఉన్నాయి.

తమన్నా జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వంటి వెబ్ సిరీస్‌లలో బోల్డ్ గా కనిపించింది. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా పాత్ర విషయంలో సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. ఈ సినిమాలో బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కొన్ని హాట్ సీన్స్ లో కనిపించింది. స్మాల్ స్క్రీన్‌పై తన పాత్రలతో ప్రయోగాలు చేసిన తమన్నా.. ఇకపై సినిమాలలో కూడా అలాంటి సినిమాలలో కనిపించాలని అనుకుంటూ ఉంది. ఓదెల 2 ని పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 1 లాగానే ఇది మిస్టరీ థ్రిల్లర్‌గా ఉంటుంది. సంపత్ నంది ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా కాకుండా క్రియేటర్ గా అనుసంధానం అయ్యారు. తమన్నా, సంపత్ నంది ఇప్పటివరకు రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ వంటి సినిమాలకు పనిచేశారు.

Next Story