తమన్నా.. రొమాన్స్ కోరుకుంటోంది

Tamanna New Movie Update. తమన్నా.. ఈ హాట్ బ్యూటీ కరోనా బారిన పడి ఇటీవలే కోలుకుంది.

By Medi Samrat  Published on  10 Dec 2020 6:58 AM GMT
తమన్నా.. రొమాన్స్ కోరుకుంటోంది

తమన్నా.. ఈ హాట్ బ్యూటీ కరోనా బారిన పడి ఇటీవలే కోలుకుంది. ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలుపెట్టింది. ప్రస్తుతం కన్నడ హిట్ చిత్రం లవ్ మోక్ టైల్ ని తెలుగు లో రీమేక్ లో నటిస్తోంది. ఆమూవీ పేరే 'గుర్తుందా శీతాకాలం'. ఈ మూవీ రొమాంటిక్ డ్రామా కాబట్టి తమన్నా కాస్త విచారం వ్యక్తం చేసిందట. ప్రస్తుత పరిస్థితుల కారణంగా తాను తెరపై శృంగారం చేయడం మర్చిపోయానని తెలిపింది. "నేను ఒక లవ్ స్టోరీ చేసి చాలా కాలం అయ్యింది. తెరపై రొమాన్స్ చేయడం మర్చిపోయినట్లు అనిపిస్తోంది.

అద్భుతమైన స్క్రిప్ట్ కారణంగా నేను ఈ ప్రాజెక్టుకు వెంటనే అవును అని చెప్పాను" అని వివరించింది తమన్నా. ఈ చిత్రంతో పాటు స్పోర్ట్స్ డ్రామా సీటీమార్ లోనూ నటిస్తోంది. ఆ మూవీలో తెలంగాణ జట్టుకు కబడ్డీ కోచ్ గా కనిపిస్తుంది.

కరోనా నుంచి కోలుకున్న వెంటనే తమన్నా తన ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో పడింది. తమన్నా ఇటీవల ఓ వెబ్ సిరీస్‌ను పూర్తి చేసుకుంది. ఒక్క రాత్రి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు 11త్ అవర్ అనే పేరు పెట్టారు. ఈ వెబ్ సిరీస్‌ను తమన్నా పూర్తి చేసుకుంది. ఇక తన సినిమాలను పూర్తి చేసేందుకు తమన్నా ప్లాన్ చేస్తోంది. నితిన్ ప్రధాన పాత్రగా తెరకెక్కుతున్న 'అందాధున్' రీమేక్‌లోను ముద్దుగుమ్మ కనిపించనుందనే వార్తలు కూడా వస్తున్నాయి.


Next Story
Share it