తమన్నాను అలా పిలవకండి.. హర్ట్ అవుతుందట

Tamanna About Her Nickname. తమన్నా భాటియా.. ఈ పేరు వింటే చాలు 'మిల్కీ బ్యూటీ' అని మరో ట్యాగ్ లైన్ తప్పకుండా తగిలిస్తాం.

By Medi Samrat  Published on  20 Dec 2020 4:20 AM GMT
తమన్నాను అలా పిలవకండి.. హర్ట్ అవుతుందట

తమన్నా భాటియా.. ఈ పేరు వింటే చాలు 'మిల్కీ బ్యూటీ' అని మరో ట్యాగ్ లైన్ తప్పకుండా తగిలిస్తాం. ఇంత తెలుపుగా ఎలా ఉంటారా అని కూడా కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. తన అందంతో కుర్రకారును గిలిగింతలు పెట్టించే తమన్నా తనకు ఈ మిల్కీ బ్యూటీ ట్యాగ్ లైన్ ను తగిలిస్తే అసలు నచ్చదని చెబుతోంది. తమన్నా ఈ విషయం చెప్పడం వెనుక కూడా ఓ కారణం ఉందనుకోండి. అభిమానులు ప్రేమతోనే నన్ను మిల్కీ బ్యూటీ అని పిలుస్తున్నారు. అది నాకు తెలుసు. కానీ, ఆ పేరు నాకు నచ్చదు. మేని ఛాయను బట్టి ఇలా పేర్లు పెట్టడం తప్పనే చెప్పాలి అని అంటోంది తమన్నా. మన దేశంలో చాలామందిలో ఇలా వైట్ కలర్ స్కిన్ పట్ల అదో రకమైన ఆకర్షణ, వ్యామోహం వున్నాయని.. ఇది మంచిది కాదని చెబుతూ ఉంది తమన్నా. మేని ఛాయను బట్టి కాకుండా, మన ప్రతిభను బట్టి టైటిల్స్ ఇస్తే బాగుంటుందని అంటోంది.

తమన్నా ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ఒక వెబ్ సిరీస్ లో కూడా తమన్నా నటిస్తూ ఉంది. ఇటీవలే ఎఫ్-3 సినిమా షూటింగ్ లో పాల్గొంది తమన్నా. పలు సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా ఇటీవలే సామ్ జామ్ ప్రోగ్రామ్ కు హాజరై పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. తన లైఫ్ లో కూడా బ్రేకప్ జరిగిందని.. ఇక తనకు వెండితెర మీద విజయ్ దేవరకొండను కిస్ చేయాలని ఉందని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసింది.
Next Story