'సర్కారు వారి పాట' సినిమా నుండి ప్రేమికుల రోజు గిప్ట్‌

SVP First Single will top your playlists from FEB 14. మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన 'సర్కారు వారి పాట' సినిమా నుండి 'కళావతి' అనే

By Medi Samrat  Published on  9 Feb 2022 7:33 PM IST
సర్కారు వారి పాట సినిమా నుండి ప్రేమికుల రోజు గిప్ట్‌

మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన 'సర్కారు వారి పాట' సినిమా నుండి 'కళావతి' అనే మొదటి సింగిల్ వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్న‌ట్లు చిత్ర‌యూనిట్ తెలిపింది. ఈరోజు మేకర్స్ సాంగ్ పోస్టర్‌ను విడుద‌ల‌ చేసారు. ఇందులో మహేష్, కీర్తి రొమాంటిక్ జోడీగా ద‌ర్శ‌న‌మిచ్చారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పోస్టర్ తో పాట‌పై అభిమానుల‌ అంచ‌నాలు రెట్టింప‌య్యాయి.

పోస్టర్‌లో మహేష్ బాబు తెల్లటి చొక్కాతో అందంగా, మనోహరంగా కనిపిస్తుండగా.. కీర్తి సురేష్ చీరలో మంత్రముగ్దులను చేస్తుంది. నేషనల్ అవార్డ్ నటి కీర్తి సురేష్.. మహేష్ బాబుతో మొదటిసారి జతకట్టడంతో అభిమానులు ఈ కొత్త జంటను ఇష్టపడుతున్నారు. వీరిద్ద‌రు తెరపై అద‌ర‌గొడ‌తార‌ని అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మొదటి సింగిల్ సంక్రాంతికి విడుదల చేయాల్సివుంది. అయితే చిత్ర‌యూనిట్‌లో చాలామందికి క‌రోనా పాజిటివ్ రావడంతో వాయిదా పడింది.

పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం GMB ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై సంయుక్తంగా నిర్మించబడింది. ఈ చిత్రం మే 12, 2022న థియేటర్లలోకి రానుంది. ఫిబ్రవరి 12 నుండి మహేష్ బాబు తన రాబోయే చిత్రం సెట్స్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం యొక్క తాజా షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. దీంతో చిత్ర షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరినట్టేన‌ని తెలుస్తోంది.


Next Story