రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన తలైవా
Superstar Rajinikanth Hospitalized. సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీ కారణంగా ఆయన ఇబ్బంది
By Medi Samrat Published on
25 Dec 2020 8:07 AM GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీ కారణంగా ఆయన ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజినీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి యాజమాన్యం బులిటెన్ విడుదల చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. రజినీ ఆస్పత్రిలో చేరారని తెలియడంతో.. ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
'అన్నాత్తే' సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘాటింగ్ జరుగుతుండగా.. చిత్ర యూనిట్‌లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో చిత్ర షూటింగ్ ను వాయిదా వేశారు. వెంటనే రజినీకాంత్ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. సంక్రాంతి కల్లా 'అన్నాత్తే' సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. రాజకీయాల్లో బిజీ కావాలనుకున్న రజనీకాంత్ అనుకోకుండా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Next Story