సోష‌ల్ మీడియాకు మ‌ళ్లీ దొరికిపోయిన థ‌మ‌న్‌.. 'క్రాక్'‌ సినిమా సాంగ్‌ కూడా కాపీనే..!

SS Thaman Copy Controversy. ఇండియ‌న్ సినిమాస్ లో పెద్ద పెద్ద సంగీత ద‌ర్శ‌కులు కూడా కాపీల‌కు మిన‌హాయింపు కాదు

By Medi Samrat  Published on  16 Dec 2020 11:49 AM GMT
సోష‌ల్ మీడియాకు మ‌ళ్లీ దొరికిపోయిన థ‌మ‌న్‌.. క్రాక్‌ సినిమా సాంగ్‌ కూడా కాపీనే..!

ఇండియ‌న్ సినిమాస్ లో పెద్ద పెద్ద సంగీత ద‌ర్శ‌కులు కూడా కాపీల‌కు మిన‌హాయింపు కాదు. అయితే కొంద‌రు అరుదుగా మాత్ర‌మే సొంత ట్యూన్స్ ను వాడుతూ ఉంటారు. టాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ సొంత ట్యూన్స్ ఏమో కానీ.. కాపీ కొట్టిన ట్యూన్స్ గురించి మాత్రం బీభ‌త్స‌మైన చ‌ర్చ జ‌రుగుతూ ఉంటుంది. ఈ క్ర‌మంలో మ‌రోసారి థ‌మ‌న్ దొరికిపోయాడ‌ని అంటున్నారు నెటీజ‌న్లు.

మాస్ మ‌హారాజ్ రవితేజ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో 'క్రాక్'‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి 'బల్లేగా దొరికావే బంగారం' పాట రిలీజ్‌ అయ్యింది. పాట అద్భుతంగా ఉంది అంటూ ఫ్యాన్స్ సంతోషించే లోపే.. ఇది కాపీ టూన్ అని తెలిసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. థ‌మన్‌ ఈ ట్యూన్‌ని లాటిన్‌ చిత్రం నుంచి కాపీ చేశారంటూ నెటిజనులు ట్రోల్‌ చేస్తున్నారు. ఒరిజనల్‌ 'సెల్వా ఎల్ నియాన్' ట్యూన్‌ని కూడా షేర్‌ చేస్తున్నారు.

''సాంగ్‌ లాటిన్‌.. కామెంట్స్‌ తెలుగు.. క్రెడిట్స్‌ తమన్‌.. ఎవరు గుర్తు పట్టరు అనుకున్నారు.. కానీ దొరికిపోయారు.. ఈ వీడియో తప్పకుండా వైరల్‌ అవుతుంది'' అంటూ నెటిజనులు తెగ ట్రోల్‌ చేస్తున్నారు. ఇక థ‌మ‌న్ కాపీ అంటూ గ‌తంలో కూడా వినిపించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేతలో కూడా పెనివిటి పాటను.. వీర సినిమాలో నుంచి కాపీ కొట్టాడు. ఇక‌ శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తులో అను అను ఎక్క‌డో విన్న‌ట్లే ఉంటుంది. ఇక ఇందులో దేసీగాల్ సాంగ్.. ఆంజ‌నేయులు సినిమాలోని న‌న్నుంటుకోమాకే ఓ మ‌ర‌ద‌లా పాట‌కు కాపీ. ఆది చుట్టాల‌బ్బాయిలోని పాల‌మూరి పాల‌పిట్ట సాంగ్ హిందీలో స‌న్నీలియోన్ బేబీగాల్ కు కాపీ. ఏ సినిమా చూసిన ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం అన్న‌ట్లు.. థ‌మ‌న్ ప్ర‌తీ సినిమాలోనూ ఏదో ఓ పాట ప‌క్క భాష‌ల్లో హిట్టైన సాంగ్స్ ఉండ‌టం కామ‌నైపోయింది అంటున్నారు నెటీజ‌న్లు.


Next Story