1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'ఆర్ఆర్ఆర్'
SS Rajamouli’s ‘RRR’ breaks records, grosses Rs 1000 cr at global box office. రాజమౌళి 'RRR' బాక్సాఫీస్ వద్ద మరో రికార్డును అందుకుంది. విడుదలైన 16 రోజుల్లోనే
By Medi Samrat Published on 10 April 2022 11:34 AM GMTరాజమౌళి 'RRR' బాక్సాఫీస్ వద్ద మరో రికార్డును అందుకుంది. విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు దాటిన ఇతర భారత సినిమాలు 'దంగల్', రాజమౌళి 'బాహుబలి 2' మాత్రమే. 'బజరంగీ భాయిజాన్', 'సీక్రెట్ సూపర్ స్టార్', 'PK'లను అధిగమించి ఆర్ఆర్ఆర్ అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది. భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామా 'RRR' డాల్బీ సినిమాలో విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా తెలిపారు.
1000 crore is a dream run for a film from India. We made our best for you, and you in return showered us with your priceless love.
— RRR Movie (@RRRMovie) April 10, 2022
Thank you Bheem @tarak9999 fans, Ramaraju @AlwaysRamCharan fans and audience across the world. #1000CroreRRR ❤️
An @ssrajamouli film. @DVVMovies pic.twitter.com/V3nnAGdf2e
'RRR' స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలోని భారత స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్ (జూనియర్ ఎన్టీఆర్), అల్లూరి సీతారామ రాజు (రామ్ చరణ్) కల్పిత కథ ఆధారంగా తీశారు. విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద.. ముఖ్యంగా మాస్ సర్క్యూట్‌లలో తిరుగులేని చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసన్ లు నటించారు.
PEN స్టూడియోస్‌కు చెందిన జయంతి లాల్ ఉత్తర భారతదేశం థియేట్రికల్ పంపిణీ హక్కులను పొందారు. అన్ని భాషల కోసం ప్రపంచవ్యాప్త ఎలక్ట్రానిక్ హక్కులను కూడా కొనుగోలు చేశారు. పెన్ మరుధర్ నార్త్ టెరిటరీలో చిత్రాన్ని పంపిణీ చేశారు. తెలుగు-భాషా పీరియడ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్‌ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య నిర్మించారు. సినిమా 25 మార్చి 2022న విడుదల అయింది.