ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రల నిడివిపై తొలిసారి స్పందించిన రాజమౌళి

SS Rajamouli shares details about Alia Bhatt, Ajay Devgn role. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం RRR పై భారీ అంచనాలు ఉన్నాయి.

By Medi Samrat  Published on  30 Dec 2021 8:55 AM GMT
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రల నిడివిపై తొలిసారి స్పందించిన రాజమౌళి

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం RRR పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్ లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రల గురించి తెలుసుకోవడానికి చాలా మందిలో క్యూరియాసిటీ నెలకొంది. ఎంత సేపు ఉంటారు.. అనే ప్రశ్నలు అందరినీ తొలచి వేస్తూ ఉన్నాయి. అయితే ఎట్టకేలకు దర్శక ధీరుడు దీనిపై మౌనం వీడారు. ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు ఆలియా భట్, అజయ్ దేవగన్ అతిధి పాత్రల్లో కనిపిస్తారని రాజమౌళి స్పష్టం చేశారు. అలియా భట్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది.

ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ, "పాత్ర అనేది నిడివిని బట్టి ఉండదు. ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రలు రెండూ చాలా ముఖ్యమైనవి. మనం RRRని శరీరంగా చూస్తే, సినిమాలో అజయ్ సర్ పాత్ర దాని ఆత్మ. సినిమాలో రెండు శక్తులు, రెండు పవర్‌హౌస్‌లను బ్యాలెన్స్ చేయాల్సిన వ్యక్తి సీత. ఆ పాత్రను ఆలియా భట్ అద్భుతంగా పోషిస్తోంది. వారు ఈ చిత్రంలో అతిధి పాత్రలు పోషిస్తున్నారు. నేను దాని గురించి ప్రేక్షకులను మోసం చేయను, ప్రాముఖ్యత పరంగా వారు సమానంగా ఉంటారు. కొన్నిసార్లు హీరోల కంటే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉందని రాజమౌళి తెలిపాడు. హిందీ భాషా ప్రేక్షకులను ఆకర్షించడానికి ఆలియా, అజయ్ దేవగన్ లను ఎంపిక చేయలేదని రాజమౌళి చెప్పాడు. నటీనటులు పాత్రలకు న్యాయం చేయగలరనే సెలెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు రాజమౌళి. రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా 7 జనవరి 2022 న థియేటర్లలో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.


Next Story
Share it