ఆ బాటలో నడుస్తున్న రాజమౌళి కుమారుడు
దర్శకధీరుడు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాణ విభాగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
By Medi Samrat Published on 19 March 2024 8:30 PM ISTదర్శకధీరుడు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాణ విభాగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకు ముందు కార్తికేయ.. రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. అంతేకాకుండా రాజమౌళికి సంబంధించిన పలు ప్రాజెక్ట్‌లను పర్యవేక్షిస్తున్నాడు. కార్తికేయ మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయిన ప్రేమలు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీదారుగా మారి హిట్ అందుకున్నాడు. తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద చాలా బాగా నడుస్తోంది. భీమా, గామి సినిమాలను కూడా అధిగమించింది. ఫైనల్ రన్‌లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. SS కార్తికేయ త్వరలో ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెడుతున్నట్లు ట్వీట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
ఆర్కా మీడియా వర్క్స్, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలకు ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ మార్చి 19న వచ్చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ మలయాళం స్టార్ నటుడు, పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి సమర్పణలో ‘ఆక్సిజన్’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రాలు రానున్నాయి. ఆక్సిజన్ సినిమాకు కొత్త డైరెక్టర్ సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకత్వం వహించనున్నారు. ఇక ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రం ఫ్యాంటసీ డ్రామాగా ఉండనుంది.