విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. యువ నటుడు ఆత్మహత్య

Srivatsav Chandrashekar Commits Suicide. త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మోడల్, యువ నటుడు‌ శ్రీవాస్తవ్‌

By Medi Samrat  Published on  6 Feb 2021 7:18 PM IST
విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. యువ నటుడు ఆత్మహత్య

త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మోడల్, యువ నటుడు‌ శ్రీవాస్తవ్‌ చంద్రశేఖర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న శ్రీవాస్తవ్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమిళనాడులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న శ్రీవాస్తవ్.. గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే షూటింగ్‌ ఉందని చెప్పి.. పెరంబూర్‌లోని ఇంటి నుంచి తన తండ్రి ఆఫీస్‌ హౌజ్‌కు చేరుకున్న శ్రీవాస్తవ్‌ అక్కడే ప్రాణాలు తీసుకున్నట్లు స‌మాచారం. శ్రీవాస్తవ్‌ మరణం పట్ల సహచర నటీనటులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కోలీవుడ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎన్నై నోకి పాయుమ్‌ తొట్టా' సినిమాలో హీరో ధనుష్‌తో శ్రీవాస్తవ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు.

తాజాగా.. వల్లామై తరాయో అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. ఈ సిరీస్‌ ఓ చినదాన అనే టైటిల్‌తో ఓ తెలుగు చానెల్‌లో ప్రసారం అవుతోంది.




Next Story