శ్రీలీల.. మ‌ళ్లీ బిజీ అయ్యింది..!

గత ఏడాది వరుస ఫ్లాప్ లతో సతమతమైన టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి.

By Medi Samrat  Published on  21 Jun 2024 8:00 PM IST
శ్రీలీల.. మ‌ళ్లీ బిజీ అయ్యింది..!

గత ఏడాది వరుస ఫ్లాప్ లతో సతమతమైన టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. శ్రీలీల గత ఐదు నెలలుగా కొత్త సినిమా చేయలేదు. అమ్మడే బ్రేక్ తీసుకుందని.. పరీక్షలకు ప్రిపేర్ అవుతోందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ శ్రీలీల హవా మొదలైంది. ఆమె ఇప్పుడు పలు చిత్రాలకు పని చేస్తోంది. మూడు ప్రాజెక్టులతో మరోసారి బిజీబిజీగా మారనుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా గత ఏడాది కాలంగా సెట్స్ పై ఉండగా.. ఇప్పుడు మరో రెండు కొత్త చిత్రాలను దక్కించుకోవడంతో ఆమె కెరీర్‌ ఊపందుకుంది. ఆమె నితిన్ హీరోగా నటిస్తున్న "రాబిన్ హుడ్" సినిమాలో చేరింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. రవితేజ 75వ చిత్రంలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభంలో మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతలో మరో రెండు మూడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటే మాత్రం శ్రీలీల మునుపటిలా బిజీ అయిపోతుంది.

Next Story