శ్రీ విష్ణు 'గాలి సంపత్‌' మొద‌లైంది..!

Sri Vishnu New Movie Started. అలా ఎలా..?, ల‌వ‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్

By Medi Samrat  Published on  17 Nov 2020 4:09 AM GMT
శ్రీ విష్ణు గాలి సంపత్‌ మొద‌లైంది..!

అలా ఎలా..?, ల‌వ‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరో హీరోయ‌న్లుగా 'గాలి సంపత్‌' చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్‌ రావిపూడి సమర్పకుడిగా వ్యవహరిస్తూ, స్ర్కీన్‌ప్లే అందించడం విశేషం. సాహు గారపాటి, హరీష్‌ పెద్దితో కలిసి ఎస్‌. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా టైటిల్‌ పాత్రను సీనియ‌ర్ హీరో రాజేంద్రప్రసాద్‌ పోషిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్ కొట్ట‌గా.. శ్రీ విష్ణు ప్రెండ్‌, హీరో నారా రోహిత్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. వరుణ్‌ తేజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సంద‌ర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. కథ నచ్చి ఈ సినిమాకు స్ర్కీన్‌ప్లే రాస్తూ నిర్మాణంలోనూ బ్యాక్‌బోన్‌గా ఉండాలనుకుంటున్నా. వినోదం, భావోద్వేగం కలగలిసిన చిత్రమిదని అన్నారు.

తండ్రీ కొడుకుల మధ్య జరిగే అందమైన ప్రయాణం ఈ సినిమా. మునుపెన్నడూ చూడని డిఫరెంట్‌ ఎమోషన్‌ను ఈ సినిమా ప్రజెంట్‌ చేయబోతోంది. ఈ నెల 18 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. శ్రీవిష్ణు పాత్ర ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందని నిర్మాత తెలిపారు.


Next Story